బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వార్’ (2019)కి సీక్వెల్‌గా వైఆర్‌ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన సినిమా ‘వార్ 2’ (War2 Telugu Trailer). అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు.హ్రితిక్‌రోషన్ (Hrithick Roshan), ఎన్టీఆర్ (JrNTR), కియారా అద్వానీ (Kiara Advani)లు మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా (Aditya Chopra) నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న (War2 Telugu Release date) విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ ‘వార్ 2’ (War2) సినిమా రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కబీర్‌సింగ్ అనే పాత్రలో హ్రితిక్‌రోషన్, విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని తెలిసింది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ ఫ్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో ‘వార్ 2‘ ట్రైలర్ సూపర్భ్‌గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్‌కి ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌లా కనిపిస్తోంది. ఈ ‘వార్ 2’ ట్రైలర్‌లోని తెలుగు డైలాగ్స్ ఇలా ఉన్నాయి.
నేను ప్రమాణం చేస్తున్నాను…నేను నా పేరుని… నా గుర్తింపుని..నా ఇంటిని…నా కుటుంబాన్ని…అన్నింటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఊరు పేరు లేని ఒక నీడలా… (హ్రుతిక్ రోషన్)
నేను మాటిస్తున్నాను…ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను…ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను.. (ఎన్టీఆర్)
మిత్రులైనా సరే..ఆప్తులైనా సరే…పట్టించుకోను…..ప్రేమించిన వారిని కూడ చూడను. వెనకడుగు వేయను.. (రోషన్)
మంచి..చెడు, తప్పు ఒప్పు…పాపం పుణ్యం…అనే ప్రతి గీతని… (ఎన్టీఆర్)
పేరు తెచ్చిపెట్టలేని త్యాగాలెన్నో చేస్తాను. దానికి ఖరీదు నా ప్రాణమైనా..చివరికి నా ఆత్మ అయినా చెల్లిస్తాను. (రోషన్)
ఆలోచించకుండ దాటేస్తాను…ఇప్పుడు నేను మనిషిని కాదు..ఒక ఆయుధాన్ని…యుద్ధంలో ఆయుధాన్ని….చస్తా లేదా చంపుతా. (ఎన్టీఆర్)
హీ ఈజ్ ఏ సోల్జర్…యు ఆర్ ఏ సోల్జర్…అండ్ దిస్ ఈజ్ ఏ వార్…
ట్రైలర్‌లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. అలాగే వార్ 2 కోసం ఎన్టీఆర్ ఓ షర్ట్‌లెస్ ఫైట్ చేసినట్లుగా ఉన్నారు. ఇది సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే హ్రితిక్‌రోషన్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ విజువల్‌గా అత్యద్భుతంగా ఉండబోతుంది. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇదే రోజున రజనీ కాంత్ ‘కూలీ’ సినిమా కూడా విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని ఈ ‘కూలీ’ సినిమా ట్రైలర్ ఆగస్టు 2న విడుదల కానుంది.