War2 Movie Teaser: గెట్‌ రెడీ ఫర్‌ వార్‌

Viswa
2 Min Read

వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న లేటెస్ట్‌ వెర్షన్‌ ‘వార్‌ 2’. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్‌(jrNTR)లు లీడ్‌ యాక్టర్స్‌. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ (War2 movie Director) ఈ మూవీకి డైరెక్షన్‌ చేయగా, ఆదిత్యా చోప్రా (War2 movie Producer) నిర్మించారు. కియారా అద్వానీ హీరో యిన్‌. లేటెస్ట్‌గా ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ టీజర్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగానే ‘వార్‌ 2’ సినిమా టీజర్‌(War2 Movie Teaser)ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

‘‘నా కళ్లు ఎప్పట్నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి..కబీర్‌ (హృతిక్‌రోషన్‌ క్యారెక్టర్‌ నేమ్‌)…ఇండియాలో బెస్ట్‌ సోల్జర్, ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌)లో బెస్ట్‌ ఏజెంట్‌…నువ్వు….కానీ ఇప్పుడు కాదు..
‘నీ గురించి నాకు తెలియదు…ఇప్పుడు తెలుసుకుంటావ్‌….! గెట్‌ రెడీ ఫర్‌ వార్‌’ అన్న పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఈ టీజర్‌లో ఉన్నాయి.

ఈ ‘వార్‌ 2’ టీజర్‌ (War2Teaser)లో హృతిక్‌రోషన్‌కు ఒక్క డైలాగ్‌ కూడా లేదు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌ డే (NTR Birthday)..సందర్భంగా ‘వార్‌ 2’ (War2 Movie) వీడియోను రిలీజ్‌ చేశారు కాబట్టి…
ఇలా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ పేరు కూడా రివీల్‌ చేయలేదు. వీరేంద్రనాథ్‌ అనే ఎక్స్‌ రా ఏజెంట్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేశారని తెలిసింది. ఇంకా..వార్‌ 2 సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనే రిలీజ్‌ చేస్తున్నారు కాబట్టి…ఈ భాషల్లోనే ఈ ‘వార్‌ 2’ లేటెస్ట్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘వార్‌ 2’ సినిమాను ఆగస్టు 14నే (War2 Release date)రిలీజ్‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ రీ–కన్ఫార్మ్‌ చేశారు.

ఈ లేటెస్ట్‌ ‘వార్‌ 2’ వీడియోలో..ఎన్టీఆర్‌–హృతిక్‌రోషన్‌ల మధ్య ఫైట్‌ సీక్వెన్స్, ఇద్దరి స్క్రీన్‌ ప్రెజెన్స్, ఫేస్‌ ఆఫ్‌ సీన్స్‌ అయితే నెక్ట్స్‌ లెవల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో షారుక్‌ఖాన్, దీపికా పదుకొనె, సల్మాన్‌ఖాన్, జాన్‌ అబ్రహాం, ఆలియాభట్, షార్వరీ..వంటి వాళ్లు భాగమై ఉన్నారు. మరి..వీరిలో ఎవరైనా..‘వార్‌ 2’లో గెస్ట్‌ రోల్‌లో ఏమైనా కనిపిస్తారా? అనేది చూడాలి.

 

 

 

 

 

Please Share
3 Comments