హృతిక్ – ఎన్టీఆర్ వార్ 2 ఫస్ట్ రివ్యూ

Viswa
NTR And Hrithick roshan War2 Telugu trailer

వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్ ) స్పై యూనివర్స్ లోని ఆరో సినిమా ‘వార్2‘.ఈ యూనివర్స్ లోనే వచ్చిన వార్ 2 సినిమాకి సీక్వెల్ గా వార్ 2 మూవీ సిద్ధమైంది. హృతిక్ రోషన్ హీరో గా, టైగర్ ష్రాఫ్ మరో లీడ్ రోల్ చేసిన వార్ మూవీ 2019లో విడుదలై, సూపర్ హిట్ గా నిలిచింది. వార్ సినిమా లో ఇండియన్ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ )ఏజెంట్ కబీర్ ఖాన్ గా హృతిక్ యాక్టింగ్ చేసాడు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్. అయితే వార్ 2 కి మాత్రం ఆయాన్ ముఖర్జీ డైరెక్టర్. అలాగే వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసాడు. వార్ సినిమా సూపర్ హిట్. సో వార్ 2 పై అంచనాలు ఉండటం సహజం.

వార్ 2 మూవీ లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనియర్ ఎన్టీఆర్, అనిల్ కపూర్ లు మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. వార్ సినిమా లో చేసిన కబీర్ ఖాన్ పాత్ర లోనే హృతిక్ కనిపిస్తాడు. రా ఎక్స్ ఏజెంట్ వీరేంద్ర గా ఎన్టీఆర్ చేశారు. ఇండియన్ స్పై ఏజెంట్ గా, కబీర్ ఖాన్ ను ట్రాప్ చేసే అమ్మాయి గా కియారా కనిపిస్తారు.

వార్ మూవీ లో ఇద్దరు ఇండియన్ సోల్జర్స్ విలన్ పై పోరాటం కనిపిస్తుంది. కానీ వార్ 2 లో మాత్రం ఇద్దరు ఇండియన్ సోల్జర్స్ ఒకరితో, మరొకరు ఫైట్ చేసుకోవడం ఉంటుంది. ఎన్టీఆర్ పాత్ర లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది.

వార్ 2 మూవీ లో దేశభక్తి, స్పై డ్రామా, యాక్షన్, లవ్… లతో పాటు గా, ఎన్టీఆర్ – హృతిక్ ల మధ్య ఓ ఎమోషనల్ కనెక్ట్విటీ ఉంటుందని, మూవి లో ఇది కీలక మని టాక్.

మూవీ లో కొన్ని ట్విస్ట్స్, సర్ప్రైస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి ఆడియన్స్ ని ఎలా, ఎంతవరకు ఎక్సయిట్ చేస్తాయన్న దానిపై ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్ ) స్పై యూనివర్స్ లో వచ్చిన సినిమా ల హీరోలు, ఇందులో గెస్ట్ గా కనిపిస్తారట. సల్మాన్, షారుక్, అలియా.. వంటి వారు కనిపిస్తారు. వార్ 3 కి లీడ్ కూడా ఉంటుంది అట. వార్ 2 టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవల్లో కనిపించడం ఖాయమని ఆంటున్నారు. హృతిక్ – ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సలామ్ అనాలి సాంగ్ కూడా ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్.

కాస్త రొటీన్ స్పై డ్రామా టెంప్లెట్ ఉంటుంది అని చెబుతున్నారు. మరి మెజారిటీ ఆడియన్స్ ఎమ్ చెబుతారో చూడాలి. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *