please subscribe to Tollywoodhub YouTube channel

వంద దేవుళ్లు…ఇది కలనో…

Viswa

Web Stories

Idhi Kalano Song: బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో విజయ్‌ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu). సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌పై రామాంజనేయులు జవ్వాజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్‌ దాస్, బక్స్, వినోదిని, మునిష్‌ కాంత్, కొడంగి వడివేలులు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఉందండి…ఈ లవ్‌ ఏట్‌ ఫస్ట్‌ సైట్‌ అనేది ఇంకా ఉందండి…

తాజా ఈ సినిమా నుంచి ‘ఇది కలనో…’ అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విజయ్‌ ఆంటోని, స్వసికల కాంబినేషన్‌లో ఈ సాంగ్‌ ఉంటుంది. సంగీత దర్శకుడు బాలాజీ శ్రీరామ్‌ స్వరకల్పనలో భాగ్య శ్రీ సాహిత్యం అందించిన, ఈ పాటను శిభి శ్రీనివాసన్, శిరీష పాడారు. ‘వంద దేవుళ్లు’ సినిమాను మేలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్‌.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi