అలనాటి ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ (JanhviKapoor) కు టాలీవుడ్‌లో అంతకంతకు క్రేజ్ పెరిగి పోతుంది. ఏ స్టార్ హీరో మూవీ ఓపెనింగ్ జరిగానా, ఆ సినిమాలోని హీరోయిన్ పేరుగా తొలుత జాన్వీ కపూర్ పేరే తెరపైకి వస్తుంది.
ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీకపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పవర్ క్రికెట్’ (ప్రచా రంలో ఉన్న టైటిల్) అనే మూవీలోనూ జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లోని మూవీలోనూ హీరోయిన్‌గా జాన్వీకపూర్ పేరే విపిం చింది.
ఇప్పుడు మళ్లీ జాన్వీకపూర్ పేరు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో ఓ పవర్‌ప్యాక్డ్ మూవీ రానుంది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీలోని హీరోయిన్ పాత్ర కోసం జాన్వీకపూర్‌ను తీసుకోవాలని, అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ‘పుష్ప 2’తో అల్లు అర్జున్‌కు, ‘జవాను’ సినిమాతో అట్లీకి హిందీ మార్కెట్‌లో బలమైన పునాదులు పడ్డాయి. కాబట్టి…అల్లు అర్జున్–అట్లీల కాంబినేషన్‌కు జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే చాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.
మరోవైపు హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో ‘పరమ్‌సుందరి’, వరుణ్‌థావన్‌తో ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ మూవీలతో జాన్వీకపూర్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.