ఇది..మరి టూ మచ్‌ గురూ!

Viswa
Kajal Aggarwal

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal )నటిగా కాస్త స్పీడ్‌ తగ్గించారు. ఇందుకు కారణం ఆమె వ్యక్తిగత కావొచ్చు. కానీ రీసెంట్‌గా నార్త్‌లోని కొందరు యూట్యూబర్లు చేసిన పనికి కాజల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు పెద్ద యాక్సిడెంట్‌ జరిగిందని, ఆమె చికిత్స పొందుతుందని కొందరు, కాజల్‌ అగర్వాల్‌ ఇక లేరని, చనిపోయారని మరికొందరు…పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లు షికార్లు చేసి, కాజల్‌ దృష్టి వరకు వెళ్లాయి. చేసేది ఏమీ లేక…తాను బతికే ఉన్నానని, తనకు ఎలాంటి యాక్సిడెంట్‌ జరగలేదని కాజల్‌ ట్వీట్‌ చేశారు. ప్రచారంలో ఉన్న వార్తలకు మసాలా యాడ్‌ చేయడం చూశాం, కానీ అసలు…ఊసే లేని విషయాన్ని సృష్టించి, దానికి ఫేక్‌ వీడియోలు సృష్టించి, ఉన్న మనిషిని లేరని చెప్పడం మాత్రం టూ మచ్‌.

ఇక హిందీలో కాజల్‌ ‘ది ఇండియా స్టోరీ’ సినిమా చేస్తున్నారు. పొలాల్లో పిచికారి చేసే పురుగుమందు సంస్థల అక్రమాల నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది. ఇంకా ఆమె హీరో యిన్‌గా నటించిన ‘ఇండియన్‌ 3’, కీలక పాత్రలో నటించిన ‘రామాయణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.

టాలీవుడ్‌ చూపంతా ‘కాంతార’ ప్రీక్వెల్‌వైపే..!

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *