KH237 : ఎంత పెద్ద స్టార్ అయిన కెరీర్‌లో ఒక్కోసారి ఒడిదొడుకులు సహజం. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు కమల్‌హాసన్. అయితే ఇటీవలి కాలంలో కమల్‌హాసన్ కాస్త ఇబ్బంది పడ్డట్లుగా కనిపించారు. పాతిక సంవత్సరాల తర్వాత బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌ను సార్ట్ చేస్తే, రిజల్ట్ తేడా కొట్టింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మళ్లీ పుంజుకు నేందుకు 37 సంవత్సరాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో ‘థగ్‌లైఫ్’ సినిమాను తీస్తే, ‘ఇండియన్ 2’ కన్నా కూడా ‘థగ్‌లైఫ్’ ఇంకా డబుల్ డిజాస్టర్ రిజల్ట్‌ను మూట గట్టుకుంది. ఈ సినిమాల రిజల్ట్‌లు తేడా కొట్టడంతో, సోషల్‌మీడియాలో కమల్‌పై కొద్దిపాటి ట్రోలింగ్ కూడా జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో కమల్‌హాసన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుంది? అన్న చర్చ అయితే మొదలైంది. ఫైనల్‌గా స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు–అరివులను దర్శకులుగా పరిచయంచేస్తూ, కమల్‌హాసన్ ఓ కొత్త సినిమా పనులను స్టార్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమాను 2024 సంక్రాంతి సమయంలోనే ప్రకటించారు. కానీ ఎందుకో సెట్స్‌కు వెళ్లలేదు. ఇప్పుడు సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను ఆర్.మహేంద్రన్, కమల్‌హాసన్‌లు నిర్మిస్తున్నారు. ఫ్లాప్ ఫీవర్ నుంచి కమల్‌హాసన్ కోలుకుని, మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తుండటం, ఆయన అభిమానుల్లో సంతో షాన్ని నింపుతోంది.