నాయగన్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నంలు కలిసి ‘థగ్‌లైఫ్’ అనే సినిమా చేశారు. మరి..ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూ (thugLife movie Review)లో చదవండి.
కథ
రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్ ) ఢిల్లీలో ఓ గ్యాంగ్ స్టర్. అమర్ (సింబు), మాణిక్యం (నాజర్), అన్బు రాజ్ (భగవతి పెరుమాల్), పాత్రోస్ (జోజూ జార్జ్), కలువ (అర్జున్ చిదంబరం) లు శక్తి రాజు గ్యాంగ్స్టర్ గ్రూప్ సభ్యులు. శక్తి రాజ్ గ్యాంగ్ కి అపోజిట్ గా సదానంద ( మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్ ఉంటుంది. సదానంద సోదరి కొడుకులు..దీపక్ (అలీ ఫజల్), రాను. మాణిక్యం కూతుర్ని సదానంద చెల్లెలి కొడుకు రాను ప్రేమించి మోసం చేస్తాడు. దీంతో మాణిక్యం కూతురు ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీంతో శక్తి రాజు అమర్లు కలిసి సదానంద చెల్లెలి కొడుకు రాను ని చంపేస్తారు. తన తమ్ముడు రాను చావుకి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని దీపక్ అనుకుంటాడు. ఈలోపు రాను చంపినందుకు శక్తి రాజును పోలీసులు అరెస్టు చేస్తారు. శక్తి రాజు అరెస్ట్ కావడంతో ఆ గ్యాంగ్‌లో అధిపత్య పోరు మొదలవుతుంది. అమర్, పాత్రోస్, మాణిక్యం కలిసి శక్తి రాజును చంపేందుకు ప్రయత్నిస్తారు. మరి… శక్తి రాజు మరణించాడా? తనను చంపాలనుకున్న వారిపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు. శక్తి రాజు కు ఎంతో నమ్మకస్తుడైన అమర్…. శక్తి రాజు కు ఎందుకు నమ్మకద్రోహం చేయాల్సి వచ్చింది? శక్తి రాజు జీవితంలో ఉన్న ఇంద్రానికి అమర్ కు ఉన్న సంబంధం ఏమిటి? చిన్నప్పుడు విడిపోయిన అమర్, అతని చెల్లెలు చంద్రికలు ఏ విధంగా మళ్లీ కలుసుకున్నారు? అమర్ పై దీపక్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ పరిణామాల మధ్యలో శక్తి రాజు వ్యక్తిగత జీవితం, అతనికి కుటుంబం ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాల సమాహారమే థగ్ లైఫ్ సినిమా (thugLife movie Review).
వివరణ
థగ్ లైఫ్ (ThugLife movie ) మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామా. కానీ రెండు గ్యాంగ్ ల మధ్య సాగే స్టోరీ కాదు ఇది. ప్రధానంగా శక్తి రాజు గ్యాంగ్ లోని సభ్యుల ఆధిపత్య పోరు, అంతర్గత కలహాల కుమ్ములాట నేపథ్యంలో నే సినిమా మెయిన్ పాయింట్ సాగుతుంది. శక్తి రాజు గ్యాంగ్ సభ్యులు, శక్తి రాజును చంపేందుకు వేసే పథకంతో ఇంటర్వెల్ ముగుస్తుంది. బతికి తిరిగి వచ్చిన శక్తి రాజు… తనను చంపాలనుకున్న వారిపై ఏవిధంగా ప్రతీకరం తీర్చు కున్నాడు అన్న అంశంతో సినిమా కథ ముగుస్తుంది. చాలా సాధారణమైన కథ ఇది. కథలో ఊహాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మణిరత్నం మార్క్ డైరెక్షన్ అయితే స్క్రీన్ పై కనిపించలేదు. పైగా కమలహాసన్ త్రిష పాతల మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ మాత్రం ఆడియన్స్ కు విసుగు తెప్పిస్తుంది (thugLife movie).
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ (ఓటీటీ)..జగమంతా కుటుంబంనాది!
సాధారణంగా మణిరత్నం సినిమాల్లో మహిళ పాత్రలో చాలా బలంగా ఉంటాయి కానీ తగ్గలేక సినిమాలో మాత్రం మహిళా పాత్రలన్నీ చాలా వరకు తేలి పోయినట్లు కని పిస్తోంది. త్రిష, అభిరామి పాత్రలకు కథలో బలం లేదు. ఐశ్వర్య లక్ష్మి పాత్రకు చిన్నపాటి ఎమోషన్ అయితే పెట్టగలిగారు. కానీ ఈ పాత్ర స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ. తొలిభాగం భాగం కొంత డ్రామాతో నడిచిన ..సెకండాఫ్ మేజర్ పార్ట్ అంతా యాక్షన్ సన్నివేశాలే స్క్రీన్ పై కనిపిస్తాయి. కథ లో కమలహాసన్ – శింబుల పాత్రల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా కొత్తదేం కాదు. చాలా రొటీన్ క్లైమాక్స్.నాయకన్ వంటి మంచి సినిమా తీసిన కమల్‌హాసన్, మణిరత్నం మళ్లీ కలిసి ఇలాంటి థగ్‌లైఫ్ సినిమా తీశారెంటి? అని ఆడియన్ నిట్టూర్చుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాడు.
పెర్ఫార్మన్స్
రంగరాయ శక్తి రాజు పాత్రలో కమలహాసన్ (KamalHaasan) ఎప్పటిలాగానే తన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ తో చూపించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. ఈ పాతలో డిఫరెంట్ షేర్స్ ఉంటాయి కమల కష్టం వెండితెరపై కనిపిస్తుంది. అమర్ గా సింబు (Simbu) పాత్ర కూడా తక్కువ ఏం కాదు. ఈ పాత్ర కోసం శింబు చాలా కష్టపడినట్లుగా తెలుస్తుంది. మంచి యాక్టింగ్ చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో తనదైన స్టైల్ చూపించాడు.
శక్తి రాజు ప్రేయసి ఇంద్రాణి పాత్రలో త్రిష కనిపిస్తారు. కానీ త్రిష పాత్రకు కథలో ఇంపార్టెన్స్ అయితే లేదు. మందు తాగుతూ త్రిష కనిపించడం, ఓ వేశ్యగా కనిపించడం..ఆమె అభిమానులకు నచ్చకపోవచ్చు. శక్తి రాజు భార్య లక్ష్మీ పాత్రలో అభిరామి నటించారు. ఒక ట్రెండు ఎమోషనల్ సీన్స్ చేశారు. విలన్స్ పాత్రలు మాణిక్యం గా నాజర్, పాత్రూస్ గా జోజూ జార్జ్, దీపక్ గా అలీ ఫజల్, సదానందగా మహేష్ మంజరేకర్, అని అలియాస్ చంద్రిక గా ఐశ్వర్య లక్ష్మి, హనీ భర్త పోలీస్ ఆఫీసర్ గా అశోక్ సెల్వన్ వారి వారి పాత్రల మేరకు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మణిరత్నం సినిమాలో కనిపించే ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ అయితే ఈ సినిమాలో మిస్సయింది. ఎడిటింగ్ ఇన్ కాస్త చేయొచ్చు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్స్ సన్నివేశాల మోతాదులో ఇందుకు స్కోప్ ఉంది. విజువల్స్ బాగున్నాయి.
ఫైనల్ గా… ఏయ్ శక్తి రాజు…గేమ్ ఓవర్
రేటింగ్ : 2.25/5.0