Rishab Shetty: ‘కాంతార:చాప్టర్1’ (Kantarachapter1 Movie) సినిమా ఈ అక్టోబరు 2న (Kantarachapter1 Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు ‘కాంతార చాప్టర్ 1’ బాయ్‌ట్రెండ్ (Kantarachapter1 Boycott) సోషల్‌మీడియాలో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ వేడుకలో రిషబ్‌శెట్టి కన్నడ భాషలోనే మాట్లాడం పట్ల, తెలుగు సినిమా అభిమానులు, తెలుగు సినిమా భాషా అభిమానులు తీవ్రంగా అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే…రిషబ్‌శెట్టి (RishbShetty) హీరోగా రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘హనుమాన్’ సిని మాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా చేయనున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తారు. ఇపాటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది. కానీ…‘కాంతార చాప్టర్ 1’ సినిమాతో రిషబ్‌శెట్టి బిజీగా ఉండటం వల్ల, కుదరలేదు.
అలాగే అశ్విన్‌గంగరాజు దర్శకత్వంలో 18వ శతాబ్దం నేపథ్యంతో రిషబ్‌శెట్టి హీరోగా బెంగాల్ నేపథ్యంతో ఓ పీరియాడికల్ డ్రామా రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన వచ్చింది.
ఇలా రిషబ్ తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడకపోవడం, కనీసం మాట్లాడటానికి ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ‘కాంతార’ ఫ్రాంచైజీ సినిమాల తరవాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రిషబ్‌కు రెండు సినిమా చాన్సులు ఇచ్చినా, రిషబ్ ఇలా చేస్తుండటం గమనార్హం.
పై రెండు తెలుగు సినిమాలే కాకుండా… ‘ది ఫ్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే సినిమా హిందీ సినిమా చేస్తున్నాడు రిషబ్‌శెట్టి. సందీప్‌సింగ్ ఈ సినిమాకు దర్శకుడు.