Kantara:Chapter1 English Version: ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉన్న సినిమాగా ‘కాంతార:చాప్టర్1’ నిలుస్తుందని, అందరూ ఊహించారు. కానీ ఇప్పటివరకు ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 800 కోట్లకు మాత్రమే చేరుకున్నాయి. రూ. 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీగా ‘కాంతార: చాప్టర్1’ నిలబడాలంటే, ఈ చిత్రం మరో రూ. 200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టాల్సి ఉంది.
ఇందుకోసం మేకర్స్ ఓ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ‘కాంతార చాప్టర్1’ (Kantara:Chapter1 English Version) సినిమాను మేకర్స్ ఇంగ్లీష్ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31న హాలీవుడ్‌లో ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా రిలీజ్ అవు తుంది. కానీ ఇక్కడి అసలు ట్విస్ట్ ఏంటంటే…‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఓరిజినల్ వెర్షన్ నిడివి 2 గంటల 48 నిమిషాలు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ నిడివి 2 గంటల 14 నిమిషాలు మాత్రమే. ల్యాగ్ సీన్స్, పాటల్నీ మేకర్స్ ప్రధానంగా కట్ చేశారట.

ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అనేది ఆస్కార్ అవార్డులు, గ్లోబల్ అవార్డులు వంటి అంతర్జాతీయ అవార్డుల నామినేషన్స్‌కు కూడ ఉపయోగపడుతుంది. ‘కాంతార చాఫ్టర్ 1’ సినిమా ఈ దిశగా కూడా ఆలోచనలు చేస్తుందని, ఇటు కలెక్షన్స్ పరంగానూ, అటు అవార్డుల పరంగానూ ‘కాంతార చాప్టర్1’ (Kantarachapter1 hollywoodRelease) సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక ‘కాంతార’ చిత్రానికి ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ‘కాంతార చాప్టర్ 1’ సినిమాకు ఇంగ్లీష్‌లో ఎలాంటి స్పందన వస్తుందనే విషయంపై సర్వ త్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒకవేళ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ క్లిక్ అయితే, మరిన్ని ఇండియన్ సూపర్‌హిట్స్ సినిమాలు ఇంగ్లీష్‌లో రిలీజ్‌కు రెడీ అవుతాయి. అలాగే ప్రస్తుతం మేకింగ్‌లో ఉన్న మరికొన్ని పెద్ద సినిమాలూ ఇంగ్లీష్‌లో రిలీజ్‌కు సిద్ధమౌతాయి.
సూపర్‌హిట్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం (Kantarachapter1 Hero and Director Rishabshetty) వహించగా, హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రుక్మీణీ వసంత్ (Kantara Heroine RukminiVasanth), గుల్షన్ దేవ య్య, జయరాంలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదలైంది.