KeerthySuresh Marriage: హీరోయిన్ కీర్తీసురేష్ (KeerthySuresh)పెళ్లి బాజా మోగింది. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు ఆంటోనీ తట్టిల్(AntonyThattil)తో కీర్తీ సురేష్ వివాహం గురువారం (డిసెంబరు 12)న గోవాలో ఘనంగా జరిగింది. మాథ్యూ తట్టిల్- రోస్లీ తట్టిల్ దంపతుల కుమారుడు ఆంటోనీ తట్టిల్, సురేష్‌కుమార్-మేనక సురేష్‌ల కుమార్తె కీర్తీసురేష్ వివాహం గోవాలో హిందూ సంప్రాదాయం ప్రకారం జరిగింది.బంధుమిత్రులు, శ్రేయోభి లాషులు, సన్నిహితులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అతికొద్ది మంది సమక్షంలో కీర్తీ సురేష్ వివాహం జరిగింది.ఆంటోనీ తట్టిల్ కీర్తీసురేష్‌కు చిన్ననాటి స్నేహితుడు. దాదాపు పదిహేనుసంవత్సరాలుగా కీర్తీసురేష్, ఆంటో నీ తట్టిల్‌ను ప్రేమించుకుంటున్నారు. ఫైనల్‌గా వివాహబంధంతో ఒక్కటైయ్యారు. ఆంటోనీ తట్టిల్ కొచ్చివాస్తవ్యుడు. ఆయనకు హోటల్ వ్యాపారాలు ఉన్నాయి.
ఇక కీర్తీసురేష్ చేసిన హిందీ చిత్రం ‘బేబీజాన్’ (Babyjhon) విడుదలకు సిద్ధం అవుతోంది. వరుణ్‌ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రం కీర్తీసురేష్‌కు హిందీలో తొలి చిత్రం. తమిళ హిట్ ఫిల్మ్ ‘తేరీ’కి హిందీ రీమేక్‌గాఈ చిత్రం రూపొందింది. అలాగే సుహాస్‌తో కలిసి కీర్తీసురేష్ ఉప్పుకప్పురంబు అనే ఓ సిరీస్ చేస్తున్నారు.అలాగే రాధిక ఆప్టేతో కలిసి కీర్తీ ‘అక్కాయ్’ అనే ఓ స్పై యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇవి కాక కీర్తీ నటించిన‘రివాల్వర్ రీటా, కన్నెవెది’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.