కీర్తీసురేష్ (Keerthysuresh) లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా (Keerthy Suresh Revolver rita)’. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్,సునీల్, అజయ్‌ఘోష్, జానీ విజయ్, కల్యాణ్ మాస్టర్, బ్లేడ్ శంకర్‌లు ఇతర లీడ్ రోల్స్ చేశారు. సుదన్ సుందరం,పళని స్వామి నిర్మించిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడో జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ ‘రివాల్వర్ రీటా’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 27న (Revolver rita Release date) రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. మరి..ఈ సారైన అనుకున్నట్లుగా రిలీజ్ అవుతుందెమో చూడాలి. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ కొన్ని మేజర్ యాక్షన్ సన్నివేశాలు చేసినట్లుగా తెలుస్తోంది.
#RevolverRita from 27th August 🔥
Tamil: 🔗https://t.co/I6CoJqOYt9
Telugu: 🔗https://t.co/wDDtwBenOE… pic.twitter.com/W9VFg0cC9q
— TollywoodHub (@tollywoodhub8) June 11, 2025