కిరణ్‌ అబ్బవరం దిల్‌ రూబా మూవీ రివ్యూ

Viswa
3 Min Read
KiranAbbavaram DilRuba Movie Review

కథ

KiranAbbavaram DilrubaReview:సిద్దార్థ్‌ రెడ్డి (కిరణ్‌ అబ్బవరం), మేఘన ఆలియాస్‌ మ్యాగీ (క్యాతీ డేవిసన్‌) ప్రేమించుకుంటారు. కానీ సిద్దార్థ్‌కు బ్రేకప్‌ చెప్పి, మేఘన మరొకరిని వివాహం చేసుకుని, అమెరికా వెళ్తుంది. బ్రేకప్‌ బాధలో కాలం వెల్లదీస్తుంటాడు సిద్దార్థ్‌. దీంతో ఆమె తల్లి సిద్దార్థ్‌ బాధను చూడలేక, మరోక చోటుకు వెళ్లిలే ఆలోచనలుమారతాయని, బాధ తగ్గుతుందని చెబుతుంది. దీంతో బెంగళూరులోని ఎమ్‌ఐటీ కాలేజీలో జాయిన్‌ అవుతాడు సిద్దార్థ్‌. అక్కడ ఓ రోజు పబ్‌లో అంజలి(రుక్సార్‌ థిల్లాన్‌)ని సేవ్‌ చేస్తాడు. సిద్దార్థ్‌ జాయిన్‌ అయిన ఎమ్‌ఐటీ కాలేజీలోనే, అంజలి కూడా చదువుతుంటుంది. ఇలా.. సిద్దార్థ్‌ని ప్రేమిస్తుంది అంజలి.మరోవైపు అంజలిని తనకు కాకుండ చేసిన సిద్దార్థ్‌పై పగ తీర్చుకోవాలని విక్కీ (క్రాంతి) ప్లాన్‌ చేస్తాడు. సిద్దార్థ్‌కు ఊరికే ‘థ్యాంక్స్‌లు, సారీ’లు చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి…సిద్దార్థ్‌తో సారీ చెప్పించుకోవాలనివిక్కీ అనుకుంటాడు. ఈ క్రమంలో సిద్దార్థ్‌కి, విక్కీకి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ గొడవల కారణంగా సిద్దార్థ్‌–అంజలిలు బ్రేకప్‌ చెప్పుకుంటారు. మరి…సిద్దార్థ్‌–అంజలిలు తిరిగి కలుసుకున్నారా? వీరిద్దరినికలపాలనుకుని అమెరికా నుంచి వచ్చిన మ్యాగీ ఏం చేసింది? డ్రగ్‌ ముఠా నాయకుడు జోకర్‌ (జాన్‌ విజయ్‌)కి, సిదార్థ్‌కు ఉన్న గొడవలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా కథనం.

విశ్లేషణ

మాజీ ప్రేమికుడిని కానీ, మాజీ ప్రేయసిని కానీ శత్రువుగా చూడకూడదు, ప్రతి చిన్న విషయానికి…ఊరికే ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పకూడదు….ఈ రెండు పాయింట్స్‌నే దర్శకుడు విశ్వకరుణ్‌ బలంగా చెప్పాలను కున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్‌ను బాగానే డిజైన్‌ చేశాడు. కానీ ‘సారీ, థ్యాంక్స్‌’ల విషయాల్లో ఒక్కోసారిహీరోయే కన్‌ఫ్యూజ్‌ అవుతున్నట్లుగా ఉంటుంది. తన కన్‌ఫ్యూజన్‌కి హీరో క్లైమాక్స్‌లో ఇచ్చిన క్లారిటీ కానీ, హీరో ఎందుకు ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పకూడదని అనుకుంటున్నాడు? అన్న బ్యాక్‌స్టోరీగానీ బలంగా ఉండదు. తండ్రిచావుతో రొడ్డుమీదకు వచ్చేశామని హీరో ఓ డైలాగ్‌ చెబుతాడు. కానీ హీరోలైఫ్‌ స్టైల్‌ చూస్తే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక లవ్‌ట్రాక్‌ అంత ఇంప్రెసివ్‌గా ఉండదు. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే మ్యాగీ తండ్రి, తల్లిల పాత్రలు ఆ తర్వాత సడన్‌గా మాయం అవుతాయి. ఎందుకో అర్థం కాదు. ఇక డ్రగ్‌ లీడర్‌ జోకర్‌గా జాన్‌ విజయ్‌ రోల్‌ కథలో ఇరికించినట్లుగా ఉంటుంది.  యాక్షన్‌ సీక్వెన్స్‌లు బాగానే ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే కేసీపీడీ ట్రాక్‌ యూత్‌ఫుల్‌ యాక్షన్‌గా ఉంటుంది. అంతపెద్ద కాలేజీలో అంత స్థాయిలో గొడవలు జరుగుతుంటే..సీసీ కెమెరాలు లేనట్లుగా…ఫ్రూవ్‌ ఉందా? అని హీరో అడగడం చాలా కామెడీగా ఉంటుంది. అయితే ఇక సినిమాలో అక్కడక్కడ వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక దర్శకుడు విశ్వ డైలాగ్స్‌ బాగున్నాయి. డైలాగ్స్‌లో డెప్త్‌ కనిపిస్తుంది. డైలాగ్స్‌ పై పెట్టిన శ్రద్ధ…స్క్రీన్‌ ప్లే పై కూడ ఉంటే బాగుండేది.

పెర్ఫార్మెన్స్‌

హీరోగా కిరణ్‌ అబ్బవరం బాగానే యాక్ట్‌ చేశాడు. ఓ మాస్‌ కుర్రాడిలా కనిపించాడు. అంజలిగా రుక్సార్‌కు మంచి రోల్‌ లభించింది. ఒకట్రెండు సీన్స్‌లో రుక్సార్‌ యాక్టింగ్‌ అదరగొట్టింది. బొమ్మరిల్లులో జెనీలియా..కిరార్‌పార్టీలో..సంయక్త…తరహా పాత్ర అయిన అంజలిగా రుక్సార్‌ మెప్పించింది. మేఘనగా క్యాతీ ఫర్వాలేదు. ఈ రోల్‌ ఇంపార్టెన్స్‌ సెకండాఫ్‌లోనే స్టార్ట్‌ అవుతుంది. డ్రగ్‌ లీడర్‌ జోకర్‌గా జాన్‌ విజయ్‌ రోల్‌ చాలా రోటీన్‌. విక్కీగా క్రాంతి ఫర్వాలేదు. హీరో ఫ్రెండ్‌ విరాజ్‌గా హాస్యనటుడు సత్య, హీరోయిన్‌ అంజలి తండ్రి, పోలీస్‌ ఆఫీసర్‌గా నరైన్, హీరోగా తల్లిగా తులసీ తదితరలు వారి వారి పాత్రల మేరకు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్, ‘సారీ–థ్యాంక్స్‌’ల థియరీ బాగానే ఉంది. క్యారెక్టర్‌ డ్రివెన్‌ ఫిల్మ్‌లో కథ ఉండాలి. అప్పుడు ఆ క్యారెక్టర్‌ స్క్రీన్‌ఫై బలంగా ఉంటుంది. దర్శకుడు ఇలాంటి పాయింట్‌ మిస్‌ అయ్యా డు. సామ్‌ సీఎస్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ సూపర్‌గా ఉంటుంది. డానియేల్‌ విశ్వాస్‌ విజువల్స్‌ ఓకే. ప్రవీణ్‌ ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

నాని నిర్మాణంలోని ప్రియదర్శి కోర్ట్‌ స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ మూవీ రివ్యూ

ఫైనల్‌గా..ఆడియన్స్‌కు…సారీ

రేటింగ్‌: 2.25/5

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *