జూనియర్‌గా కిరీటి హిట్టైయ్యాడా?

Kumar NA

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమా జూనియర్‌ (KireetiReddy junior Review) థియేటర్స్‌లో విడుదలైంది. మరి..ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిచిందా? జూనియర్‌తో నటుడిగా తన తొలి ప్రయత్నంలోనే కిరీటిరెడ్డి విజయాన్ని అందుకున్నాడా? అనేది రివ్యూలో చదవండి.

కథ

అభినవ్‌ (కిరీటి) పుట్టగానే, తల్లి చనిపోతుంది. దీంతో అభివన్‌ను అతి ప్రేమితో పెంచుతాడు అతని తండ్రి కోదండపాణి (రవీచంద్రన్‌). ఈ అతి ప్రేమ నచ్చని అభి చదువు కోసం హైదరా బాద్‌ వెళ్తాడు. లైఫ్‌లో జ్ఞాపకాలు ముఖ్యమని నమ్మే అభి, కాలేజీ లైఫ్‌ను చాలా సరదాగా ఎంజాయ్‌ చేస్తాడు. ఈ క్రమంలోనే స్ఫూర్తితో(శ్రీలీల) ప్రేమలో పడి, చదువు తర్వాత స్పూర్తి ఉద్యోగం చేస్తున్న కంపెనీలో తానూ ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ సీఈవో విజయ సౌజన్య (జెనీలియా)కు, అభికి అస్సలు పడదు. అయితే తనకు ఏ మాత్రం ఇష్టం లేని అభితో కలిసి, విజ యనగరం వెళ్లాల్సి వస్తుంది విజయ సౌజన్య. విజయనగరం వెళ్లడం కూడా విజయ సౌజన్యకు ఇష్టం లేదు. మరి..విజయనగరం వెళ్లడానికి విజయ సౌజన్య ఎందుకు ఇష్ట పడటం లేదు? అభికీ- విజయ సౌజన్యకు ఉన్న రిలేషన్‌ ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.

విశ్లేషణ

‘ఎంత పెద్ద స్టార్‌ క్యాస్టింగ్‌ ఉన్నా, విజువల్‌గా ఎంత గ్రాండియర్‌గా సినిమా తీసినా..కథలో బలమైన భావోద్వేగాలు లేకపోతే సినిమా ఫలితం ప్రతికూలంగా ఉంటుంది’ అని ‘జూనియర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో ఈ చిత్రం డీవోపీ సెంథిల్‌కుమార్‌ చెప్పారు. ‘జూనియర్‌’ సినిమా చూసిన వారికి..సెంథిల్‌ అనుభవంతో చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి. ఫామ్‌లో ఉన్న హీరో యిన్‌ శ్రీలీల, జెనీలియా రీ ఎంట్రీ, రవిచంద్రన్‌, రావు రమేష్‌, అచ్చుత్‌కుమార్‌ వంటి ప్యాండింగ్‌ ఆర్టిస్టులు…సెంథిల్‌కుమార్‌ వంటి కెమెరామెన్‌, దేవి శ్రీ ప్రసాద్‌ వంటి మ్యూజిక్‌ డైరెక్టర్‌…ఇలా జూనియర్‌ సినిమా ఎందులోనూ తక్కువ కాదు. కానీ ఆడియన్స్‌ అంచనాలను అందుకోవడంలో జూనియర్‌ పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయాడు.

కథ రోటీన్‌గా ఉన్నప్పుడు, చెప్పే విధానం అయినా కొత్తగా ఉండాలి. దర్శకుడు రాధాక్రిష్ణ ఈ విషయంలో విఫలమైయ్యాడు. ఓ ఎమోషనల్‌ సీన్‌తో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత, కాలేజీ క్యాంపస్‌కు షిప్ట్‌ అవుతుంది. తొలిభాగం అంతా ఆల్మోస్ట్‌ ఇక్కడే. విరామం తర్వాత కథ విజయనగరంకు షిప్ట్‌ అవుతుంది. ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ను హీరో కనిపెట్టే సీక్వెన్స్‌ తరహాలు పాత సినిమాల్లో కొకొల్లలు. జూనియర్‌ సినిమా చూసే ఆడియన్స్‌కు ఆడియన్స్‌కు శ్రీమంతుడు, మహర్షి, మిర్చి’ సినిమాలు గుర్తుకు వస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ములపు ప్రభావం కూడా అంతంత మాత్రమే. కథ- కథనాల విషయంలో మేకర్స్‌ మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. అలాగే జెనీలియా పాత్రకు కాస్త ఎమోషనల్‌ డోస్‌ పెంచాల్సింది. సాంగ్స్‌, ఫైట్స్‌, విజువల్స్‌తో సినిమాను ఆడియన్స్‌ మెచ్చుకునే రోజులు కావివి. కథ-స్క్రీన్‌ప్లేనే ముఖ్యం. ఆ పరంగా జూనియర్‌ కాస్త వెనకపడ్డాడు. ఈ సినిమాను 9 నెలల్లో తీయాలనుకుని, 3 సంవత్సరాల పాటు తీశారు. ఈ మధ్యలో వీలైనంతగా రీ షూట్స్‌, కథలో మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. వైరల్‌ వయ్యారీ సాంగ్‌, వైవా హర్ష-సత్యల కామెడీ బాగున్నాయి.ప్రముఖ దివంగత నటులు పునీత్‌ రాజ్‌కుమార్‌, టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ల రిఫరెన్స్‌లు మెప్పిస్తాయి.

ఎవరు ఎలా చేశారు?

Kireeti Reddy junior Movie Review
Kireeti Reddy junior Movie Review

తొలి సినిమాతోనే నటుడిగా ఫర్వాలేదనిపించాడు కీరిటీ. డ్యాన్స్‌ బాగానే చేశాడు. ఫైట్స్‌ కూడా ఒకే. కానీ ఎమోషనల్‌ సీన్స్‌లో యాక్టింగ్‌ పరంగా ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తొలి సినిమానే కాబట్టి ఫర్వాలేదు. పర్‌ఫెక్ట్‌ హీరో మెటిరియల్‌గా కీరిటి కనిపిస్తున్నాడు. ఇక శ్రీలీలది ఎంత రోటీన్‌ పాత్ర అంటే…అంత రోటీన్‌ పాత్ర. సెకండాఫ్‌లో శ్రీలీల సడన్‌గా మాయం అవుతుంది. కానీ వైరల్‌ వయ్యారి (viral vayyari) సాంగ్‌ థియేటర్స్‌లో సూపర్‌గా ఉంది. కిరిటీ-శ్రీలీల మంచిగా డ్యాన్స్‌ చేశారు. ఇక జెనీలియా పాత్ర పరిధి, డెప్త్‌ ఇంకాస్త లోతుగా ఉండా ల్సింది. రవీంద్రన్‌, విలన్‌గా చేసిన అచ్చుత్‌కుమార్‌, రైజ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఓనర్‌గా రావురామేష్‌లు వారి వారి పాత్రల పరిధి మేరకు చేశారు. వైవా హర్ష, సత్యల కామెడీ బాగుంది. సెంథిల్‌ కుమార్‌ కెమెరాపనితనం అద్భుతంగా ఉంది. దేవి శ్రీ మ్యూజిక్‌ బాగుంది. వైరల్‌ వయ్యారీ పాటకు మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ కూడా బాగుంది. కానీ సినిమాకు ఓ ప్రధానబలంగా మ్యూజిక్‌ నిలవలేకపోయింది. రాధాక్రిష్ణ డైరెక్షన్‌లో కొత్తదనం లేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా, బాగా కాస్ట్‌లీగా ఉన్నాయి.

ఫైనల్‌గా…జూనియర్‌ …జస్ట్‌ పాస్‌
రేటింగ్‌ 2.25/5

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *