Kishkindhapuri villain Sandy master: ‘తమిళ సినిమా ‘లియో’,మలయాళ చిత్రం ‘లోక’, తెలుగు సినిమా ‘కిష్కింధపురి’లో విలన్ రోల్ చేసింది ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. ఇంకా పరిచయం చేయా లంటే… రజనీ కాంత్ ఇటీవల హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలోని ‘మౌనికా..’ పాట, కమల్‌హాసన్ ‘విక్ర మ్’లోని ‘మత్తురా మత్తురా..’ పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఈ శాండీ మాస్టర్‌యే. పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ ప్రమోషనల్ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసింది ఈ శాండీ మాస్టర్ (Sandymaster) నే. తెలుగులో ఇటీవల విడుదలైన ‘కిష్కింధపురి’ సినిమాలో విలన్ రోల్ చేసి, అందర్నీ ఆశ్చ ర్యప రిచిన ఈ శాండీ మాస్టర్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, కొన్ని ఆసక్తిక రమైన విషయాలను వెల్లడించారు.
– స్ట్రీట్ డ్యాన్సర్‌గా నా జీవితం మొదలైంది. 150 రూపాయల కోసం రోడ్లపై డ్యాన్స్ చేశా. ఆ తర్వాత ఎన్నో డ్యాన్స్ షోలలో పాల్గొన్నాను. ఓమ్‌గారి షో కారణంగా తొలిసారి హైదరాబాద్ రావడం జరి గింది. ఇక ‘విక్రమ్’లోని సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను. ఆ సమయంలో లోకేష్‌కనగరాజ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. నా కళ్లను చూసి, ఆయన ‘లియో’లో నటించే అవకాశం కల్పిం చారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

– లియో చిత్రంలో నేను చేసిన సైకో పాత్ర బాగా రీచ్ కావడంతో, ఆ తర్వాత నాకు వరుస సైకో పాత్రలు రావడం మొదలైయ్యాయి. కానీ నేను కథలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాను. అలా మలయాళ సినిమా ‘లోక’, ‘కిష్కింధపురి’ సినిమాల చిత్రీకరణల్లో ఒకేసారి పాల్గొన్నాను. ఇప్పుడు రెండుసినిమాలూ విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచాయి. చాలా సంతోషంగా ఉంది. ఇకపై నా దృష్టి అంతా యాక్టింగ్‌పైనే పెడతాను. ప్రస్తుతం నేను యాక్టింగ్‌లో ఎల్‌కేజీ స్టూడెం ట్‌నే. పీహెచ్‌డీలు, డబుల్‌డిగ్రీలు తీసుకున్నవారు చాలామంది ఉన్నారు. యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టానా, కొరియోగ్రఫీని వదులుకోను. రాఘవాలారెన్స్‌గారిలా మల్టీటాస్కింగ్ చేయాలని ఉంది.

– అనుష్కాశెట్టి,జయసూర్యగార్లు యాక్ట్ చేస్తున్న ‘కథనార్’ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాను. ఇంకా పా.రంజిత్‌గారి ప్రొడక్షన్‌లో నేనే హీరోగా ఓ మూవీ చేస్తున్నాను. ఓ పేద వాడి కుటుంబ కథ ఈ చిత్రం. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్‌లో దర్శకత్వం వహించే ఆలోచన ఉంది. కానీ ఇందుకు సమయం పడుతుంది.