శేఖర్‌కమ్ముల సినిమాలంటే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ మూవీస్‌లా ఉంటాయి. కానీ..ఆయన డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘కుబేర’ (Kubera movie Release) మాత్రం కాస్త కొత్త జానర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీ వల ట్రాన్స్ ఆఫ్ కుబేర అంటూ మేకర్స్ విడుదల చేసిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. విజువల్స్, ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ ఆర్‌ఆర్ బాగున్నాయి. ఇన్ని రోజులు..కుబేర సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఉన్న ప్రేక్షకుల అంచనాలను ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ (Trance of kubera) వీడియో పెంచే సిందనే అనుకోవాలి.
ఈ కుబేర సినిమాలో నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush)లు లీడ్ రోల్స్ చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. హిందీ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. మోస్ట్ లీ..విలన్ రోల్ కావొచ్చు. అంటే..మల్టీమిలియనీర్ అన్నట్లు. పైగా జిమ్ సర్భ్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం మరో విశేషం. ధనుష్ కెరీర్‌లో కుబేర 51వ సినిమా. ఇంకా ఈ మూవీ ట్రాన్స్ ఆఫ్ కుబేర చూసినప్పుడు…డబ్బు ప్రధానంశంగా తెలుస్తోంది. కాస్త పీరియాడికల్ టచ్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగార్జున, ధనుష్, రష్మికామందన్నాల క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉండేలా కనిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ కుబేర చిత్రం జూన్ 20న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.