Little Hearts Movie OTT: మౌళి తనుజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించి లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లిటిల్‌హార్ట్స్’. సాయి మర్తండ్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య హాసన్ నిర్మించాడు. బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బన్నీ వా సు, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు.
ఈ లిటిల్‌హార్ట్స్ సినిమాను రూ. 2.5 కోట్ల రూపాయలతో నిర్మించగా, థియేట్రికల్‌గా రూ. 50 (LittleHeartsMovie Collections)కోట్లరూపాలయకు పైగా కలెక్షన్స్ సాధించింది. నిజానికి ఈ లిటిల్‌హార్ట్స్ సినిమాను ఓ వారం రోజులు థియేటర్స్‌లో ఆడించి, వెంటనే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారు మేక ర్స్. కానీ సెప్టెంబరు 5న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ను మంచి స్పంద న లభించింది. దీంతో ఈ లిటిల్‌హార్ట్స్ సినిమాను మరికొన్ని రోజులు కూడా థియేటర్స్‌లోనే ఆడించారు. ఇది ఈ సినిమాకు బాగా ఫ్లస్ అయ్యింది. థియేట్రిలక్‌గా ఈ సినిమా మంచి బిజి నెస్ చేసింది.
తాజాగా ‘లిటిల్‌హార్ట్స్’ సినిమాను అక్టోబరు 1 నుంచి ఈటీవీ విన్ (ETV WIN Ott) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా, ప్రకటించారు. అయితే..లిటిల్‌హార్ట్స్ ఓటీటీ (Little Hearts Movie OTT) స్ట్రీమింగ్‌లో కొత్త సన్నివేశాలు కూడా ఉంటాయని, ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను ఓటీటీలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు.