Lokesh Kanagaraj DC: తమిళ సినిమా ‘మా నగరం’తో దర్శకుడుగా పరిచయం అయ్యారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన కార్తీ ‘ఖైదీ’, కమల్ హాసన్ ‘విక్రమ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. తమిళ హీరో విజయ్‌తో ‘మాస్టర్, లియో’, రజనీకాంత్‌తో ‘కూలీ’ వంటి సినిమాలను చేసి, తమిళంలో స్టార్ డైరెక్టర్ అయ్యిపోయారు లోకేశ్ కనగరాజ్ మరియు ఆయన చేసిన సినిమాలు లోకేశ్ కనగరాజ్ DCతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి.
అయితే ఈ గ్యాప్‌లో నటి–మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతీహాసన్‌తో లోకేశ్ కనగరాజ్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోలో లోకేశ్ కనగరాజ్ నటించాడు. ఆ సమయంలోనే లోకేశ్ కనగరాజ్ హీరోగా సినిమా రాబోతుందనే టాక్ వినిపించింది. లోకేశ్ హీరోగా నటిస్తారంటూ, అప్పట్నుంచి అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా అధికారిక ప్రకటన వచ్చేసింది. Lokesh Kanagaraj DC ప్రేక్షకుల అందరినీ ఆకర్షిస్తున్నాడు.
లోకేశ్ కనగరాజ్ హీరోగా తమిళంలో ‘డీసీ’ అనే సినిమా వస్తుంది. బాలీవుడ్ నటి వామికా ఈచిత్రంలో హీరోయిన్. ఇందులో దేవదాస్ పాత్రలో లోకేశ్, చంద్ర పాత్రలో వామికా నటి స్తారు. ‘దేవదాస్’ పేరులోని తొలి అక్షరం ‘డీ’, చంద్ర పేరులోని తొలి అక్షరం ‘సీ’లను కలిసి లోకేశ్ కనగరాజ్ సినిమాకు ‘డీసీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా ఉన్నారు మేకర్స్.
సన్‌పిక్చర్స్ సంస్థ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ను నిర్మిస్తుంది. ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథే శ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.