గత ఏడాది 2023లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్’ (Mad2 Release) నార్నే నితిన్, సంతోష్‌శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్‌లో చేసిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీని కళ్యాణ్‌శంకర్ డైరెక్ట్ చేయగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sithara Entertainments)పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ramcharan: చరణ్‌పై ఇంత వ్యతిరేకతా?
‘మ్యాడ్’ సినిమా హిటై్టన సమయంలోనే ‘మ్యాడ్ 2’ (Mad2) చేయాలని నాగవంశీ ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లు గానే ‘మ్యాడ్ 2’ను ప్రకటించి, ‘మ్యాడ్ స్క్వైర్’ టైటిల్ పెట్టి, షూటింగ్ స్టార్ట్ చేశారు. సేమ్ యాక్టర్స్‌ను తీసుకున్నారు. లేటెస్ట్‌గా ఈ మూవీని మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇక్కడే ఉంది అసలు..ట్రిక్కు. మార్చి 29 అంటే…సితార ఎంటర్‌టైన్మెంట్స్‌కు బాగా కలిసొచ్చిన రిలీజ్ డేట్ అన్నమాట.
Raashii Khanna glamorous Photos
‘డీజేటిల్లు’ సినిమా సితారలో మంచి హిట్ ఫ్రాంచైజీ, ఈ సినిమాకు సీక్వెల్‌గా చేసిన ‘డీజే టిల్లు 2’ అంటే ‘డిజేటిల్లు స్క్వైర్’ కూడా 2023 మార్చి 29న రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మార్చి 29కి….సితారలోని హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజీగా ఉన్న ‘మ్యాడ్ 2’ రాబోతుంది. ఇలా సితారకు భలే మంచి రిలీజ్ డేట్ దొరికింది.
అయితే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో విజయ్‌దేవరకొండ హీరోగా ఓ మూవీ VD12 షూటింగ్ జరుగుతోంది. గౌత మ్ తిన్ననూరి ఈ మూవీకి డైరెక్టర్. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు ‘మ్యాడ్ 2’ని రంగంలోకి దించారు. అంటే విజయ్ దేవరకొండ మూవీ పోస్ట్ పోన్ అయిన విషయం కన్ఫార్మ్ అయిపోయింది.