మహేశ్‌బాబు తండ్రి పాత్రలో మాధవన్ (Hero Madhavan) యాక్ట్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. హీరో మహేశ్‌బాబు (Hero Maheshbabu), దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు ప్రుథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాకు విజయేంద్రప్రసాద్ కథ అందించారు. అయితే కథ రిత్యా మహేశ్‌బాబు తండ్రి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. దీంతో ఈ రోల్ చేయమని తమిళ నటుడు విక్రమ్‌ను అప్రోచ్ అయ్యారు దర్శకుడు రాజమౌళి. కానీ విక్రమ్ ఇందుకు సున్నితంగా నో చెప్పాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొంతమంది యాక్టర్స్‌ను సంప్రదించినా, రాజమౌళికి నో అనే అన్సర్‌నే వినిపించింది. ఫైనల్‌గా తమిళ నటుడు మాధవన్‌ను రాజమౌళి అప్రోచ్ అవ్వగా, ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేసే మాధవన్ ఈ సినిమాకు ఒకే చెప్పాడు. పైగా…’రాకెట్రి ది నంబిఎఫెక్ట్’ సినిమాలో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి పాత్రలో మాధవన్ ఓదిగిపోయిన తీరు అభినందనీయం. ఈ తరుణంలో రాజమౌళికి , మాధవన్ ఓ బెస్ట్ ఆప్షన్ అనిపించి ఉండొచ్చు.
ప్రస్తుతం మహేశ్‌బాబుతో రాజమౌళి (Director SSRajamouli) హైదరాబాద్‌లోనే షూటింగ్ చేస్తున్నాడు. వారణాసి సెట్‌ను తలిపించేలా ఉన్న ఓ భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సెట్స్‌లో మాధవన్ జాయిన్ అయ్యాడు. మాధవన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఈ షూటింగ్ షెడ్యూల్ తర్వాత ..ఓ భారీ షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేశారు రాజమౌళి. ఆరేడు నెలల క్రితమే అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించి, ఫైనలైజ్ కూడా చేశారు. కానీ…ఇప్పుడు కెన్యా దేశంలో పరిస్థితులు బాగోలేవు. దీంతో..ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగేందుకు ఎక్కడ షూటింగ్ చేయాలా? అని రాజమౌళి టెన్షన్ పడుతున్నారట.
మరోవైపు ఆగస్టు 9న మహేశ్‌బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించిన గ్లింప్స్ లేదా ఏదైనా ఏదైనా అప్‌డేట్‌ను ఆశిస్తున్నారు మహేశ్‌బాబు ఫ్యాన్స్. గత రెండు సంవత్సరాలుగా మహేశ్‌బాబు బర్త్ డేకి, ఆయన సినిమాల అప్‌డేట్స్ రాకపోవడంతో, మహేశ్‌బాబు అభిమానలు కాస్త నిరాశలో పడ్డారు. మహేశ్‌బాబు పాత సినిమాల రీ-రిలీజ్‌లతో సరిపెట్టుకున్నారు. మరి..ఈ సారి రాజమౌళి ఏమన్నా…మహేశ్‌బాబు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ని ఏమైనా పరిశీలిస్తాడెమో చూడాలి. కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.