Varanasi Movie: మహేశ్‌బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అండ్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబరు 15న హైదరాబాద్‌లో మేకర్స్ ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించి, ‘వారణాసి’ సినిమాలో మహేశ్ బాబు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే రుద్ర సినిమాను 2027 వేసవిలో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ (MaheshBabu Varanasi) టైటిల్ చివర్లో ‘గ్లోబ్‌ట్రోటర్’ (Globetrotter) అనే మాటతో పాటగా, ‘టైమ్‌ట్రోటర్’ (timeTrotter) అని కూడా కనిపించింది. దీంతో ‘వారణాసి’ సినిమా టైమ్‌ట్రావెల్ సినిమా అని కూడా తెలుస్తుంది.
ఇక ‘వారణాసి’లో మహేశ్‌బాబు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. రామాయణంలోని ఓ ముఖ్యఘట్టం ఆధారంగా ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా రాజమౌళి (Varanasi Movie Director SSRajamouli) తెలిపారు. ఈ ‘వారణాసి’ చిత్రంలో రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారనే విషయాన్ని కూడా రాజమౌళి కన్ఫార్మ్ చేశారు. రాముడి గెటప్‌తో ఉన్న మహేశ్‌బాబు లుక్‌తో దాదాపు 60 రోజుల పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశామని, ఈ సీక్వెన్స్ థియేటర్స్‌లో అదిరిపోతుందని రాజమౌళి తెలిపారు. ‘వారణాసి’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, తాము రిలీజ్ చేయడానికి ముందుగానే, ఆన్‌లైన్‌లో లీక్ బాధకలిగిందని కూడా రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్‌బాబు కూడ ఈ ఈవెంట్‌లో భావోద్వేగంతో మాట్లాడారు. నాన్నగారు తనను ఎప్ప ట్నుంచో ఓ పౌరాణిక సినిమా చేయమని చెబుతున్నారని, కానీ అప్పట్లో తనకు కుదర లేదని, ఇప్పుడు ‘వారణాసి’ సినిమాలో అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని అంటూ మహేశ్‌బాబు భావోద్వేగంతో మాట్లాడారు. ఈ విధంగా ‘వారణాసి’ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా తెలిపారు. ఇంకా ఈ వేడుకలో ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్, ఈ చిత్రం కథ అందిస్తున్న వారిలో ఒకరైన విజయేంద్రప్రసాద్, చిత్ర నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయలు మాట్లాడి, ‘వారణాసి’ సినిమా పట్ల తమ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, వ్యక్తం చేశారు.
