120కి పైగా దేశాలు…20 భాషలు…గ్లోబల్‌ రేంజ్‌ రిలీజ్‌

Viswa
Mahesh and Rajamouli SSMB29

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. అలాగే ఈ సినిమాకు ఇంటర్‌ నేషనల్‌ రిలీజ్‌(SSMB29 Release) ఉండేలా, ఓ ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణసంస్థతో టైఅప్‌ అవ్వాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారు. అయితే సోనీ పిక్చర్స్‌ ఇంటర్‌నేషన్‌ సంస్థతో రాజమౌళి, మహేశ్‌బాబు అసోసియేట్‌ అవుతున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.పైగా మహేశ్‌బాబు నిర్మాత వ్యవహరించిన సూపర్‌హిట్‌ మూవీ ‘మేజర్‌’కు సోనీ పిక్చర్స్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మాణభాగస్వామి. ఈ విధంగా సోనీతో మహేశ్‌కు మంచి అనుబంధమే ఉంది. మరోవైపు వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌తో మహేశ్‌బాబు అండ్‌ టీమ్‌ చర్చలు జరుపుతోందట. ఈ సంస్థ నిర్మించిన ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమా తెలుగు రీలీజ్‌కు, మెయిన్‌ క్యారెక్టర్‌ అయిన ముఫాసాకు మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

SSMB29 Will Release in 120 Countries
SSMB29 Will Release in 120 Countries

ఇవన్నీ కాస్త పక్కన పెడితే…ప్రజెంట్‌ మహేశ్‌బాబు సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రాలతో పాటుగా, ప్రధానతారాగణం అంతా పాల్గొంటున్నారు. అయితే అక్కడి షూటింగ్‌ అనుమతుల నిమిత్తం అక్కడి రాజకీయ నేతలను కలిశారు రాజమౌళి. ఈ తర్వాత రాజమౌళితో పాటుగా, 120 మంది సినిమా క్రూ కెన్యా వచ్చారని, కెన్యా ప్రాంతం పర్యాటకానికి, సినిమా చిత్రీకరణలకు మంచి ప్రదేశమని, ఈ ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 సినిమా 120 దేశాల్లో రిలీజ్‌ (SSMB29 Release)అవుతుందని కెన్యా  ‘ఎక్స్‌’లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 20 భాషల్లో డబ్‌ చేసి, రిలీజ్‌ చేయాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తు న్నారని తెలిసింది.

ఇదే జరిగితే…ఈ సినిమాకు కనీ వినీ ఎరుగని బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ నమోదు అవుతాయి. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ సినిమాకు ఓ నిర్మాణభాగస్వామిగా ఉన్నారు. 2027 మార్చి 25న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట రాజమౌళి. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25, 2022లో విడుదలైన సంగతి తెలిసిందే.

అలాగే మహేశ్‌బాబుతో తాను చేస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ నవంబరులో రిలీజ్‌ చేస్తామని రాజమౌళి ఆల్రెడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ టచ్‌ ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను భారత దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో రిలీజ్‌ చేయాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తు న్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. నవంబరు నెల ప్రారంభంలో ఈ విషయాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *