రాజమౌళి(SSRajamouli) తో సినిమా అంటే, ఆ సినిమా హీరోకి పెద్ద రెస్ట్ ఉండదు. రాజమౌళి టాస్క్‌లు అలా ఉంటాయి. పైగా మరో దర్శకుడితో ఆ హీరో సినిమా చేయకూడదు. అందుకే రాజమౌళితో సినిమా అంటే హీరోలు తెగ కష్టపడిపోతుంటారు. కానీ హీరో మహేశ్‌బాబు మాత్రం చాలా సరదాగా సినిమా తీసేస్తున్నారు. వీలైనప్పుడు ఫ్యామిలీ వేకేషన్స్‌కు వెళ్తున్నారు. చెప్పాలంటే మహేశ్‌బాబుకు కూడా అలా కలిసొస్తుంది. తాజాగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి (SSMB29 Shooting Break), ఫ్యామిలీతో కలిసి వేకేషన్‌లో భాగంగా శ్రీలంక వెళ్లారు మహేశ్‌బాబు. అయితే ఇక్కడ మహేశ్ బాబుకు ఈ అవకాశం కల్పించింది రాజమౌళియే కావడం విశేషం.
ఇంతకీ విషయం ఏంటంటే…’బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమాలను కలిపి, ‘బాహుబలి ది ఎపిక్’గా (Baahubali The Epic) ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ఎడిటింగ్ పనులపై బిజీగా ఉన్నారు రాజమౌళి (SSRajamouli). దీంతో ప్రస్తుతం తాను మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబరు 31న విడుదల కానుంది. ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాల్లో లేని కొన్ని కొత్త సన్నివేశాలు, ఓ డిఫరెంట్ క్లైమాక్స్ ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాలో ఉంటాయనట. ఆల్మోస్ట్ ఓ కొత్త సిని మాను చూసినట్లుగానే ‘ది బాహుబలి ఎపిక్’ ఉంటుందని టాక్. ఈ ఆసక్తికరమైన విశేషాలపై …అక్టోబరు నెలలో ఓ క్లారిటీ రానుంది.
మహేశ్‌బాబు, రాజమౌళిల సినిమాకు రూ. 40 కోట్లతో స్పెషల్ సెట్?
ఇక ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ఎడిటింగ్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ను షురూ చేస్తారు రాజమౌళి. నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ ఫారిన్‌లో జరుగుతుందా? లేక హైదరాబాద్ శివర్లలో రూ. 50 కోట్ల రూపాయాలతో, వారణాసి నగరాన్ని క్రియేట్ చేసిన, సెట్స్‌లో జరుగుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రియాంకా చోప్రా,
మాధవన్, ప్రుధ్వీరాజ్‌సుకుమారన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.