హీరో విష్ణు (ManchuVishnu) మంచు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa Release). మంచు విష్ణు టైటిల్ రోల్ చేసిన ఈ ‘కన్నప్ప’ మూవీని తొలుత ఏప్రిల్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ‘కన్నప్ప’ (Kannappa movie) సినిమా రిలీజ్‌ను జూన్ 27కి వాయిదా వేశారు. ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉందనగా, చిత్రంయూనిట్‌కు ఓ చేదు వార్త ఎదురైంది. ఈ సినిమాలో ఎంతో కీలకమైన సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ఒకటి మిస్సైందని, ఇది ఓ ఆఫీస్ బాయ్ దొంగిలించాడనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. ‘కన్నప్ప’ టీమ్‌కు ఇది పెద్ద షాక్ అనుకోవచ్చు. రిలీజ్‌కు నెల రోజులు ముందు ఇలా జరగడం నిజంగా ఏ చిత్రంయూనిట్‌కైనా బాధాకరమైన విషయమే. ప్రస్తుత సంఘటనల నేపథ్యంలో ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న (Kannappa movie Release date) విడుదల అయ్యే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి.
మూడేళ్ల తర్వాత అడివి శేష్ డకాయిట్
శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. తిన్నడు నుంచి శివ భక్తుడుగా మారే కన్నప్పగా విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీలో మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. హిందీలో మహాభారతం తీసిన ముఖేష్‌కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, శ్రీవిష్ణు ‘ఓం భూమ్ బుష్’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రీతి ముకుందన్ ….ఈ కన్నప్ప సినిమాలో కథానాయికగా చేశారు. ఇంకా…ఈ కన్నప్ప సినిమాలోనే మంచు విష్ణు కుమారుడు అవ్రామ్, ఆయన కుమార్తెలు అరియానా, వివియానాలు కూడా యాక్ట్ చేయడం విశేషం. మరి..విష్ణు మంచు కన్నప్ప సినిమా విడుదలపై త్వరలోనే మరో అప్‌డేట్ రావొచ్చు.