‘ది రాజాసాబ్’ (Prabhas The RajaSaab Teaser) సినిమా టీజర్ ఇప్పట్లో వచ్చేలా లేదు. ‘ది రాజాసాబ్’ (Prabhas The RajaSaab Teaser) సినిమా టీజర్ ఈ క్రిస్మస్‌కు లేదా న్యూ ఇయర్ సందర్భంగా రావొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ క్రిస్మస్‌కుకానీ, న్యూ ఇయర్‌కు కానీ వచ్చేలా లేదు. త్వరలోనే ‘ది రాజాసాబ్’ టీజర్ వస్తుందని, కానీ అది క్రిస్మస్‌కుకానీ, న్యూ ఇయర్‌కు కానీ కాదని, సరైన సమయంలో మేమే చెబుతామని ‘ది రాజాసాబ్’ యూనిట్ మేకర్స్‌ఓ నోట్‌ను విడుదల చేశారు. ఇంకా ‘రాజాసాబ్’ సినిమా చిత్రీకరణ 80శాతానికిపైనే పూర్తయిందని, మెరుగైన అవుట్‌ఫుట్ కోసం టీమ్ ఎంతో కష్టపడుతుందని కూడా మేకర్స్ తెలిపారు.

ఇక ‘‘ది రాజాసాబ్’’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ సిద్దుజొన్నలగడ్డ ‘జాక్’, అనుష్కాశెట్టి ‘ఘాటి’, ధనుష్ ‘ఇడ్లీ కడై’ వంటి సినిమాలు ఏప్రిల్ 10న రిలీజ్‌కు షెడ్యూల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’ సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలు వెల్లడై య్యాయి. కానీ రాజాసాబ్ కొత్తగా తెలిపిన నోట్‌లో రాజాసాబ్ సినిమా ఏప్రిల్10నే వస్తుందన్నట్లుగా ఓ హ్యాష్‌టాక్ ఇచ్చారు. దీంతో ‘రాజాసాబ్’ సినిమా ఏప్రిల్ 10నే కన్ఫార్మ్ అయిపోయింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు.