ప్రభాస్ కెరీర్‌లోని 25వ సినిమాగా ‘స్పిరిట్’ మూవీ రాబోతుంది. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ సినిమాలు తీసిన సందీప్‌రెడ్డివంగా ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ రోల్. ఇలా ప్రభాస్ పోలీసాఫీసర్ రోల్ చేయడం ఇదే తొలిసారి.
ఈ సినిమా చిత్రీకరణ ఈ ఇపాటికే మొదలు కావాల్సింది. కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ప్రభాస్ మరో ఏ సినిమాకూ కమిట్ కాకూడదని, ‘స్పిరిట్’ చిత్రీకరణ పూర్తయ్యేవరకూ మరో మూవీ సినిమా సెట్స్‌లో ప్రభాస్ అడుగుపెట్టకూడదని సందీప్‌రెడ్డి వంగా కండీషన్స్ పెట్టారట.

కానీ ప్రస్తుతం ప్రభాస్ ‘ ది రాజాసాబ్, ఫౌజి’ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల చిత్రీకరణలు ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తవుతాయి. అప్పట్నుంచి ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటారు.
ఈ లోపు ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, సాంగ్స్, లొకేషన్స్…వంటివి ఫైనలేజ్ చేసే పనిలో పడ్డారు సందీప్‌రెడ్డి వంగా. ఇందులో భాగంగానే…‘స్పిరిట్’ సినిమాలోని ఓ ప్రధానమైన పాత్రకు మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టీని సంప్రదించారట …సందీప్ అండ్ టీమ్. ప్రస్తుతం ప్రాధమికమైన చర్చలే జరుగుతున్నాయట. అన్నీ కుదరితే ప్రభాస్ సినిమాలో మమ్ముట్టీ నటించే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ మమ్ముట్టీతో కుదరకపోతే…దుల్కర్‌సల్మాన్‌ను అయినా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సందీప్ రెడ్డి వంగా.
కానీ..కొన్నికారణాల వల్ల కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’, బాలకృష్ణ ‘డాకుమహారాజ్’ సినిమాల్లోని కీలక పాత్రలకు ముందు ఓకే చెప్పిన దుల్కర్, ఆ తర్వాత ఈ సినిమాల నుంచి తప్పుకున్నారు. మరి…ప్రభాస్ ‘స్పిరిట్’ సిని మాకు ఏం జరుగుతుందో చూడాలి.