Patriot: మోహన్‌లాల్, మమ్ముట్టీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘పేట్రియాట్’ అనే టైటిల్ ఖరారైంది. దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ ‘పేట్రియాట్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు మోహన్‌లాల్, మమ్ముట్టి. 2008లో వచ్చిన ‘ట్వంటి:20’ సినిమా తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘పేట్రియాట్’ (Patriot ). 2024 నవంబరులోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కానీ మమ్ముట్టి అనారోగ్య పరిస్థితుల కారణంగా, ఈ సినిమాకు బ్రేక్ పడింది. మమ్ముట్టి తిరిగి కోలుకుని ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్‌లో ప్లాన్ చేశారు. దసరా సందర్భంగా పేట్రియాట్ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో నయనతార, ఫాహద్‌ఫాజిల్, కుంచాకోబోబన్ వంటి స్టార్స్ యాక్టర్స్ కూడా భాగమైయ్యారు. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిని మాను తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.