నాగార్జున ‘మన్మథుడు’ సినిమాలో యాక్ట్ చేసిన అన్షు (Manmadhudu Heroine Anshu sagar Interview) అప్పట్లో ఆడియన్స్‌లో సంచలనం. ఆ వెంటనే అన్షు ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ సినిమా చేసింది. కానీ సడన్‌గా సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమై, 23 సంవత్స రాల తర్వాత తిరిగి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. సందీప్‌కిషన్ ‘మజాకా’ మూవీలో ఓ లీడ్ రోల్ చేసింది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లోని ఈ మూవీలో సందీప్‌కిషన్ హీరోగా నటించగా, రీతూ వర్మ హీరోయిన్‌గా చేశారు. రావు రమేష్ మరో లీడ్ రోల్ చేశారు. హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అన్షు పంచుకున్నారు (Manmadhudu Heroine Anshu sagar Interview)
నా పేరు మార్చండి!
నాగచైతన్య-సాయిపల్లవిల ఎమోషనల్ లవ్‌స్టోరీ మూవీ తండేల్ రివ్యూ
నా పేరు వీకిపీడియాలో అన్షు అంబానీ అని ఉంటుంది. నిజానికి నా పేరు కేవలం అన్షు. అన్షు అంబానీ కానే కాదు. అంబానీ పేరుతో నాకు ఎలాంటి లింక్ లేదు. నన్ను అన్షు అని పిలవండి లేదా నా భర్త (సచిన్ సాగర్) పేరు కలిసొచ్చేలా అన్షుసాగర్ అని పిలిచినా ఫర్లేదు. అంతేకానీ…అన్షు అంబానీ అని మాత్రం పిలవకండి. వీలైతే నా పేరు మార్చండి
సైకాలజీ చదివాను
నేను నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా షూటింగ్ చేసే సమయంలో నా వయసు పదిహేను సంవత్స రాలు . నా హైస్కూలింగ్ కూడా పూర్తి కాలేదు. సినిమాల పట్ల, సినిమా ఇండస్ట్రీ పట్ల నా ఆలోచనల్లో పరిణీతి లేదు. దీంతో స్టడీస్‌పై ఫోకస్ పెట్టాను. నేను బ్రిటిష్ అమెరికన్ విమెన్‌ని. కాబట్టి…లండన్ వెళ్లి, అక్కడ చదువుకున్నాను. మాస్టర్స్ పూర్తి చేశాను. సైకాలజిస్ట్‌గా కెరీర్‌గా మొదలు పెట్టి, ఓ క్లినిక్‌ని కూడా రన్ చేస్తున్నాను.
అలా ఇండస్ట్రీకి వచ్చాను

నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా రి–రీలీజ్ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌వాళ్లు నా బైట్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను మాట్లా డాను. సోషల్‌మీడియాల్లో నా పేరు మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. నా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫాలోయేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ సమయంలో నా మేనే జర్‌ను ‘మజాకా’ రైటర్ ప్రసన్నకుమార్ కాంటాక్ట్ అయ్యారు. ‘మజాకా’ కథ విని, హ్యాపీ ఫీలయ్యాను. కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. అలా ‘మజాకా’ మూవీలో యాక్ట్ చేసే చాన్స్ దక్కింది.
తెలుగు సినిమా ఎంతో మారిపోయింది!
నేను లండన్‌లో ఉన్నప్పుడు ఓ సారి అక్కడి క్యాస్టింగ్ ఏజెన్సీకి నా వివరాలు వచ్చి, యాక్టింగ్ రోల్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నాను. నేను చేసిన దక్షిణాది సినిమాల వివరాలు వాళ్లకు చెప్పాను. కానీ వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. అసలు…తెలుగు సినిమాలంటే ఏంటో తెలియన్నట్లుగా మాట్లాడారు. బాలీవుడ్ షారుక్‌ఖాన్ అన్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. తెలుగు సినిమా గురించి, అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్నారు. నా లండన్ ఫ్రెండ్స్ కూడా తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటున్నారు. నా భర్త నేను తెలుగు సినిమాలు చేస్తున్నానని, గర్వంగా చెప్పుకుంటున్నారు.
దీపికాపదుకొనె కంటే చిన్నదాన్నే!
ఫలనా తరహా పాత్రలే చేయాలని కండీషన్స్ ఏమీ పెట్టుకోలేదు. మదర్ రోల్, హీరోయిన్ రోల్, సైడ్ క్యారెక్టర్ రోల్…ఇలా ఏ రోల్ అయినా చేస్తాను. దీపికా పదుకొనె ఇప్పుడు అన్నీ రోల్స్ చేస్తున్నారు. చెప్పాలంటే ఆమె కంటే నేను చిన్నదాన్నే. నేను లండన్‌లో ఉంటాను. అవకాశాలు వస్తే ఇక్కడికి వస్తాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఇకపై కొనసాగలనుకుంటున్నాను. అందుకే తెలుగు నేర్చుకుంటున్నాను.