దీపావళికి మిత్రమండలి రిలీజ్‌…మరో మూడు సినిమాలు కూడా!

Viswa
Mithra Mandali All Set for a Diwali. Worldwide Release on on October 16th!

ప్రియదర్శి, నిహారిక ఎన్‌.ఎం., విష్ణు ఓయ్, రాగ్‌ మయూర్, ప్రసాద్‌ బెహరా లీడ్‌ రోల్స్‌లో నటించిన సినిమా ‘మిత్రమండలి’ (Mithra Mandali). స్నేహాం, యవ్వనం, రహస్యం…వంటివి ప్రధానాంశాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విజయేందర్‌ .ఎస్‌ డైరెక్టర్‌. బన్నీ వాసు నిర్మాణసంస్థ బీవీ వర్క్స్‌ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌ రెడ్డి తీగల ఈ మిత్రమండలి సినిమాను నిర్మించారు. లేటెస్ట్‌గా ఈ సినిమాను దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ఇక దీపావళి సందర్భంగా ‘మిత్రమండలి’ సినిమాతో పాటుగా, కిరణ్‌ అబ్బవరం ‘కె–ర్యాంపు’, ప్రదీప్‌రంగనాథ్‌ ‘డ్యూడ్, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’ వంటి తెలుగు సినిమాలు కూడా విడుదల అవు తున్నాయి. మరి…‘మిత్రమండలి’, ‘కె–ర్యాంపు’, ‘డ్యూడ్‌’, ‘తెలుసుకదా’ చిత్రాలు ఈ దీపావళికే విడుదల అవుతాయా? లేక ఈ మూవీస్‌లో ఏదైనా సినిమా వాయిదా పడుతుందా? అనేది తెలియాలంటే, మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *