Manchu MohanBabu: రెండుమూడ్రోలుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు మంగళ వారం తారా స్థాయికి చేరాయి. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు. వచ్చి రాగానే మంచు మనోజ్ (ManchuManoj)ను ఇంటి నుంచి బయటకు పంపారు. మనోజ్ సామాన్లను సైతం వాహనాల్లో ప్యాక్ చేశారు. కానీ ఇంటి నుంచి వెళ్లడానికి మనోజ్ మాత్రం అంగీకరించనట్లుగా లేదు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇది మా ఫ్యామిలీ ఇష్యూ..సమస్యలు అన్నీ సర్దుకుంటాయి. దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయవద్దు అని మంచు విష్ణు (ManchuVishnu) దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చెప్పారు.
మనోజ్ భార్య భూమా మౌనిక పోలీసులుకు ఫోన్ చేసి, మనోజ్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే మోహన్‌బాబు ఇంట్లో పని మనిషి మాట్లాడిన వీడియోలు బయ టకు వచ్చాయి. ‘మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీ సభ్యులకు ఇష్టం లేదని, మనోజ్‌యే ముందు దాడి చేశాడని’ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
అయితే కొంత సమయం తర్వాత మనోజ్ (Manchu Manoj) ఇంట్లోకి వెళ్లెందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనూ కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డట్లుగా తెలుస్తోంది.
ఇక తనను దూరం పెట్టారంటూ, ఆస్తుల కోసం తాను ఏమీ గొడవలు చేయడం లేదని, తన నాన్న మోహన్‌బాబు, అన్న విష్ణు తనకు అన్యాయం చేశారని చెబుతూ, డిసెంబరు 9న మనోజ్ ఓ నోట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందుకు బదులుగా మోహన్‌బాబు రిలీజ్ చేసిన ఓ ఆడియో నోట్ సంచలనమైంది.
#MohanBabu బహిరంగ వాయిస్ #ManchuMohanbabu#ManchuVishnu#ManchuFamilyIssue#ManchuManoj#ManchuLakshmipic.twitter.com/ReU2k0ecbi
— TollywoodHub (@tollywoodhub8) December 10, 2024
‘‘మనోజ్ నిన్ను ఎలా పెంచాన్రా..నా గుండెల మీద తన్నావ్..నీకు నేను అన్నీ ఇచ్చిన నాపై ఏవోవో చెబుతున్నావ్. నీ భార్య మాటలు వింటున్నావ్. తాగుడుకు బానిస అయ్యావు. ఇంట్లోవాళ్లను కొడుతున్నావ్..నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా…? మా నాన్న నాకు ఏం సంపాదించి ఇవ్వలేదు.ఇదంతా నా కష్టార్జితం. నా ఆస్తులు నాకు ఇష్టమొచ్చిన వారికి ఇస్తాను. లేదా గంగలో కలుపుతాను.ఇది నా ఇల్లు. రమ్మంటే రావాలి. అంతే. తప్పు చేయనని చెప్పి, ఇంట్లోకి వచ్చావ్..మళ్లీ తప్పులు చేస్తున్నావ్..మీ అమ్మ ఏడుస్తుంది’’ అంటూ దాదాపు 12 నిమిషాల నిడివి ఉన్న ఓ ఆడియో మేసేజ్‌ను మోహన్‌బాబు (Manchu MohanBabu) షేర్ చేశారు.
మీడియాపై దాడి
ఓ సందర్భంలో సహనం కోల్పోయిన మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారికి గాయాలు అయ్యాయి. వారి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మీడియా పట్ల మోహన్‌బాబు వైఖరిని తప్పు పడుతూ, ఆయన భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని, మీడియా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
#Hyderabad : #ManchuFamilyIssue
High Drama continued at the residence of actor #MohanBabu at #Jalpally on Tuesday night after his son #ManchuManoj (half brother of #ManchuVishnu) tried to enter the premises that his daughter was inside.
Bouncers of #ManchuMohanbabu who were… pic.twitter.com/lgEHK2Axrp
— Surya Reddy (@jsuryareddy) December 10, 2024
ఆస్పత్రిలో మోహన్‌బాబు
వరుస పరిణామలతో కలత చెందిన మోహన్‌బాబు ఆస్పత్రిపాలైయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. హైబిపీ, చెస్ట్ పెయిన్‌తో ఆయన బాధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మోహన్‌బాబు వెంట ఆయన కుమారుడు మంచు విష్ణు ఉన్నారు.