Mohanlal Drishyam 3 Shoot: హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు పదికి పైగా సినిమా లొచ్చాయి. కానీ వీరి కాంబినేషన్‌లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మాత్రం చాలా స్పెషల్. ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం 1, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాలూ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ‘దృశ్యం’ సినిమా, అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ కాబడి, అక్కడ కూడా విజయం సాధించిందంటే, ‘దృశ్యం’ (Drishyam 3) సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘దృశ్యం 2’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చినప్పటికీని, ఓటీటీలో కూడా సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. దృశ్యం 2 (Drishyam 2) సినిమా, థియేటర్స్‌లో కాకుండ, డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడమనే అంశం అప్పట్లో పెద్ద సంచలనమైంది. కేరళ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
Happy birthday, Meena Ma’am. #Drishyam3@Mohanlal #JeethuJoseph @antonypbvr pic.twitter.com/Wq8en0xjlo
— Aashirvad Cinemas (@aashirvadcine) September 16, 2025
ఇప్పుడు ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీని గురించి ఇంత పెద్ద ప్రస్తావన ఎందుకంటే…‘దృశ్యం 3’ సిని మా చిత్రీకరణ సోమవారం నుంచి కేరళలో ప్రారంభం కాబోతుంది. తొలిరోజు నుంచే హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ‘దృశ్యం1, దృశ్యం 2’ ( (Drishyam 2) చిత్రాల్లో నటించిన నటీనటులు అందరూ ఈ ‘దృశ్యం 3’లోనూ నటించనున్నారనే టాక్ విని పిస్తోంది.మొదటి రెండు భాగాల్లో మోహన్‌లాల్ పోషించిన జార్జి కుట్టీ పాత్రనే, దృశ్యం 3లోనూ మోహన్‌లాల్ పోషిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే… ‘దృశ్యం 3’ (Mohanlal Drishyam 3 Shoot) సినిమాను గతంలో మాదిరిగా కాకుండ, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ముందుగా మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు జీతూ జోసెఫ్. ఆ తర్వాత తెలుగు వెర్షన్‌ను హీరో వెంకటేష్‌తో పూర్తి చేస్తారు జీతూ జోసెఫ్. అయితే అజయ్‌దేవగన్ హిం దీ నటించే ‘దృశ్యం3’కీ మాత్రం జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించరు. హిందీలో ‘దృశ్యం 1, దృశ్యం 2’ సినిమాలకు పనిచేసిన, దర్శకుడు నిషికాంత్ కామత్ ‘దృశ్యం 3’ సినిమాకూ వర్క్ చేస్తాడు. మరి..‘దృశ్యం 3’ సినిమా రిలీజ్ ఎప్పుడన్న అంశంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
ఇడ్లీలు వేయడానికే పుట్టాననిపిస్తోంది…!.. ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదల