కథ మొదలైన యాభై నిమిషాల తర్వాత మోహన్‌లాల్‌ పాత్ర తెరపై కనిపిస్తుంది. కథ మొదలైన సన్నివేశాలకు, ఇంట్రవెల్‌లో కనెక్ట్‌ చేశాడు దర్శకుడు. కానీ ఇవి రోటీన్‌ సీన్స్‌. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ కూడా పెద్ద కొత్త పాయింట్‌ ఏమీ కాదు. మోహన్‌లాల్‌ పాత్రలు, పృథ్వీరాజ్‌ పాత్రలు కథలో బ్యాలెన్స్‌ కాలేదు. మరీ..ముఖ్యంగా మోహన్‌లాల్‌ క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సన్నివేశాలు, ఎలివేషన్‌ సీన్స్‌ ఎక్కువైయ్యాయి. అయినా. .ఫర్లేద నుకున్నా…ఇవి కథకు అవసరం లేకుండ ఉన్నవే. ఇక సినిమాలో సాంగ్స్, కామెడీ…వంటి సన్నివేశాలు ఎలాగూ లేవు. అలాంటి సినిమా కూడా కాదు ఇది. ఫస్ట్‌పార్టుకు ఉన్న హైప్‌తో ఈ సినిమాకు వెళితే మాత్రం ఆడియన్స్‌కు నిరాశపడతారు. సినిమా నిడివి కూడా దాదాపు మూడు గంటలు ఉంటుంది. థియేటర్స్‌లో ఆడియన్స్‌ ఒపిగ్గా కూర్చొ వాల్సిందే. సెకండాఫ్‌లో వచ్చే ఫారెస్ట్‌ సీన్, ఓ అరెస్ట్‌ సీన్‌ బాగుంటాయి. కానీ ఒకట్రెండు సీన్స్‌తో సినిమా నిలవడవు. కథతోనే నిలబడతాయి.