మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితులు. అయితే మోహన్‌లాల్ లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్ (Mohanlal thudarum). ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా యాక్ట్ చేశాడు. అతని భార్యగా శోభన చేసింది. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలిసి నటించిన సినిమా ‘తుడురుమ్’. ఈ మలయాళ మూవీ ఈ నెల 25న తెలుగులో కూడా విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
#Mohanlal #Thudarum #ThudarumOnApril25 #Thudaram తెలుగు ట్రైలర్ pic.twitter.com/a6vSNhWt5D
— TollywoodHub (@tollywoodhub8) April 22, 2025
ఓ ట్యాక్సీ డ్రైవర్, అతని కారు పోలీస్‌స్టేషన్‌లో చిక్కుకోవడం, దీంతో అతనికి చిక్కులు ఎదురుకావడం వంటి అంశాలతో ఈ మూవీ సాగుతుంది. తెలుగు ట్రైలర్‌ను చూస్తుంటే…చిన్న పాటి క్రైమ్ ఎలిమెంట్ కూడా ఈ మూవీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దృశ్యం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ ట్రైలర్‌లో పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. ఈ సస్పెన్స్‌ను ఆడియన్స్ థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జనవరి 20నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది.