Little Hearts Movie Review: సినిమా లిటిల్‌హార్ట్స్ రివ్యూ
కథ
చదువులో అఖిల్ (తనుజ్ మౌళి) పూర్ స్టూడెంట్. అఖిల్‌ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చూడాలన్నది అతని తండ్రి గోపాల్ రావు(రాజీవ్ కనకాల) కల. కానీ అఖిల్‌కు ఎంసెట్‌లో ర్యాంకు రాదు. దీంతో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌లో జాయిన్ చేయిస్తాడు. మరోవైపు కాత్యాయని (శివానీ నాగారం) కూడా చ దువులో వీక్. కానీ కాత్యాయనిని డాక్టర్ చేయాలన్నది ఆమె తల్లిదండ్రుల అభిలాష. అఖిల్ లాగా, కాత్యాయని కూడా ఎంసెంట్‌లో ర్యాంకు రాదు. దీంతో అఖిల్ జాయిన్ అయిన లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లోనే, కాత్యాయని కూడా జాయిన్ అవుతుంది. కాత్యా యనిని చూడగానే అఖిల్ ప్రేమలో పడతాడు. కాత్యాయని కూడా అఖిల్‌కు దగ్గరవుతుంది. కానీ ఇంతలో అఖిల్ ఆశ్చర్య పోయేలా కాత్యాయని ఓ విషయం చెబుతుంది. మరి..అఖిల్ ఆశ్యర్య పోయేలా ఏం జరిగింది? అఖిల్–కాత్యాయనిల ప్రేమకథ ఏమైంది? కత్యాయని కోసం అఖిల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? వీరిద్దరి ప్రేమకోసం ఇరు కుటుంబసభ్యులు ఏం చేశారు?.
విశ్లేషణ
లిటిల్‌హార్ట్స్ టీనేజ్ లవ్‌స్టోరీ. ఈ సినిమా కథ పదేళ్ల క్రితం జరుగుతుంది కనుక, ఆ కాలం ఆడి యన్స్ అందరూ ఈ కథను రిలేట్ అవ్వొచ్చు. బాగా చదివే అమ్మాయి, చదువులో డల్‌గా ఉండే అబ్బాయి…ఈ కాంబినేషన్‌లో చాలా లవ్‌స్టోరీస్ వచ్చాయి. అమ్మాయి– అబ్బాయి…ఇద్దరూ గుడ్ స్టూడెంట్స్‌గా లవ్‌స్టోరీలు ఉన్నాయి. కానీ..ఇద్దరు చదువురాని స్టూడెంట్స్, వీరిపై వారి తల్లిదండ్రుల ఆశలు….ఈ కాంబినేషన్ ఆడియన్స్‌కు కొత్తగా అనిపించవచ్చు. స్నేహితుల మధ్య కనిపించే బడ్డీ కామెడీ బాగా అలరి స్తుంది. ఈ సినిమాలో హీరో మౌళి– అతని స్నేహితుడు మధుగా నటించిన సాయిల మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. ప్రేమకథ, కామెడీ, సెటైర్స్…ఈ సినిమాకు ప్రధానబలంగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిన సెకండాఫ్ బాగా నవ్విస్తుంది. చివర్లో చిన్నపాటి సందేశం ఇవ్వడం ఈ సినిమాకు కుదరింది. చైల్డ్ ఆర్టిస్టుల యాక్టింగ్ బాగుంది. సినిమా తక్కువ నిడివి ఉండటం, ఎక్కువ సాగదీత సన్నివేశాలు లేకపోవడం అనేవి ఆడియన్స్‌కు నచ్చే అంశాలుగా ఉండొచ్చు. కానీ మలయాళి సినిమా ‘ప్రేమలు’ ఫ్లేవర్ మాత్రం ‘లిటిల్‌హార్ట్స్’ చిత్రంలో కనిపిస్తుంది.

నటీనటులు-సాంకేతిక విభాగం
అఖిల్ పాత్రలో మౌళి బాగా సెటై్టయ్యాడు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఒకే. ఒక కాత్యాయనిగా శివానీ నాగారం చక్కగా నటించింది. స్క్రీన్‌పై చలాకీగా కనిపించింది. మౌళి స్నేహితుడిగా నటించిన సాయిని ఆడియన్స్‌ను బాగా నవ్వించాడు. చైల్డ్ ఆర్టిస్టులు నిఖిల్ అబ్బూరి, రాజా ప్రజ్వల్ చక్కగా చేశారు. హీరో తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల ఈ సినిమాకు బాగా ఫ్లస్ అయ్యాడు. సత్యకృష్ణన్, అనితా చౌదరి వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు సాయిమార్తాండ్ రైటింగ్ స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్ బాగా రాసుకున్నాడు. ఈటీవీ – నిర్మాత ఆద్యిత్యాహాసన్‌ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సూర్య బాలాజీ కెమెరా ఒకే. సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్రధాన ఎస్సెట్‌గా నిలి చింది. మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
ఫైనల్‌గా: కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియన్స్‌కు లిటిల్‌హార్ట్స్ చిత్రం ఓ మంచి చాయిస్.
రేటింగ్: 2.75/5.0