ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తీసిన హిట్ ఫిల్మ్ ‘బాయ్స్’ (2003)లో ఒక లీడ్ యాక్టర్ చేశాడు తమన్ (Music director S Thaman) సిద్దార్థ్, జెనీలియాలు హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీ తర్వాత తమన్ యాక్టర్‌గా మరో మూవీ చేయలేదు.
ఆరుసంవత్సరాల తర్వాత సడన్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. 2009లో వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ’ తో మ్యూజిక్ డైరెక్టర్‌గా స్క్రీన్‌పై తమన్ పేరు పడింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ కెరీర్ వన్నాఫ్ ది టాప్ పోజిషన్స్‌లోకి వెళ్లింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. కానీ సడన్‌గా తమన్ యూటర్న్ (Music director S Thaman) తీసుకున్నాడు.
ఇరవైరెండు సంవత్సరాల తర్వాత తమన్ మళ్ళీ యూటర్న్ తీసుకుని, యాక్టర్‌గా కెరీర్‌ను రీస్టార్ట్ చేశాడు. తమిళ యువ హీరో అధర్వ హీరోగా ‘ఇదమ్ మురళి’ (Idhayam Murali) అనే మూవీ రాబోతుంది. ఈ చిత్రంలోనే తమన్ ఓ లీడ్ యాక్టర్‌గా చేస్తున్నాడు.తమన్‌కు జోడీగా ప్రగ్యానగ్రా (తెలుగులో ‘లగ్గం’ సినిమాలో హీరోయిన్‌గా చేశారు) చేస్తున్నారు.
అధర్వ సరసన ప్రీతిముకుందన్ నటిస్తోంది. లేటెస్ట్‌గా ‘ఇదమ్ మురళి’ టైటిల్ టీజర్‌ను అనౌన్స్‌చేశారు. టీజర్‌ను బట్టి ఇదొక లవ్‌స్టోరీ ఫిల్మ్ అని స్పష్టం చేస్తోంది. నిర్మాత ఆనంద్ భాస్కరన్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. వీలైతే ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.