టాలీవుడ్‌లో ప్రజెంట్ వన్నాఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఎస్‌ఎస్ తమన్ (Music Director SS Thaman)ఒకరు. కెరీర్‌లో జట్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్న తమన్ కెరీర్‌కు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా గురించి పలు మార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాయే తన కెరీర్‌కు ఓ యూటర్న్‌లాంటి మూవీ అని, తమన్‌తన లేటెస్ట్ మూవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేయగా, పూజాహెగ్డే హీరోయిన్. ఈషా రెబ్బా మరో లీడ్ రోల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా 2018 దసరాకు విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే తనను ఓ యాక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు శంకర్ కంటే కూడా…తనకు ‘అరవిందసమేత వీరరాఘవ, అల..వైకుంఠపురములో…’ వంటి సినిమాలకు చాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్‌యే తనకు ఇష్టమని తమన్ చెప్పుకొచ్చాడు.
గేమ్‌చేంజర్‌లో హుక్ స్టెప్స్ లేవు: Music Director SS Thaman

శంకర్ డైరెక్షన్‌లో తమన్ మ్యూజిక్ అందించిన ‘గేమ్‌చేంజర్’ (Gamechanger) మూవీ మ్యూజిక్ విషయంలో ఈ చిత్రం హీరో రామ్‌చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమన్ స్పందించాడు. ‘గేమ్‌చేంజర్’ సినిమాలోని నానా హైరానా, రా మచ్చా రా, దూప్…వంటి పాటల్లో సరైన హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే ….ఈ సిని మాలోని సాంగ్స్ వైరల్ కాలేకపోయాయని, మ్యూజిక్ వీడియోస్‌కు పెద్ద స్థాయిలో వ్యూస్ రాలేదని తమన్ చెప్పుకొచ్చాడు. అదే అల..వైకుంఠపురములో.. సినిమాలోని ‘బుట్టబొమ్మ, సామజవరగమన..వంటి పాట ల్లో మంచి హుక్ స్టెప్స్ ఉన్నాయని, తనకు మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ లభించిందని తమన్, చెప్పు కొచ్చాడు. హుక్‌స్టెప్స్, సాంగ్స్ విషయంలో కొరియోగ్రాఫర్స్, హీరోలు కూడా ఫోకస్ పెట్టాలన్నట్లుగాతమన్ మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజాసాబ్ పాటలన్నీ మళ్లీ మొదలుపెట్టా తమన్
ప్రభాస్ రాజాసాబ్ (TheRajasaab) సినిమా పాటలన్నింటిని మళ్లీ మొదలుపెట్టాను. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. అప్పట్లో కొన్ని సాంగ్స్ చేశాను. కథ రిత్యా …ఓ లవ్ సాంగ్, ఇంట్రో సాంగ్, ఓ స్పెషల్ డ్యాన్స్ మెంబర్‌లు ఉన్నాయి. కానీ ఇటీవల నేను ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలకు సంగీతం అందించాను. సో..రాజాసాబ్ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగానే ఉండాలని, పాతపాటలన్నింటినీ తీసేసి, కొత్తగా అన్నీ పాటలను కంపోజ్ చేస్తున్నాను. ప్రస్తుతం ‘అఖండ 2, ఓజీ’ వంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నాను.