VrushaKarma: నాగచైతన్య (Nagachaitanya) హీరోగా నటిస్తున్న మిస్టికల్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాకు ‘వృషకర్మ’ (VrushaKarma)అనే టైటిల్ ను ఖరారు చేశారు. నవంబరు 23న నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగానే ‘వృషకర్మ’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను హీరో మహేష్ బాబు ట్విట్టర్ లో షేర్ చేశాడు.
అలాగే ఈ చిత్రం నుంచి నాగచైతన్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘విరూపాక్ష’ వంటి సూపర్‌డూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు (VrushaKarma Movie Director) తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దక్ష అనే ఆర్కియాలజీ రీసెర్చర్‌గా మీనాక్షీ రోల్ ఉంటుంది.
నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఇటీవలే హైద రాబాద్‌లో ఓ పెద్ద షూట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఓ సొరంగం నేపథ్యంతో ఈ సినిమాలో వచ్చే ఓ ఎపిసోడ్ సూపర్భ్‌గా ఉండబోతుందని తెలిసింది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య ఆల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని, అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఆడియన్స్‌ను మెప్పించెలా ఉంటుందని తెలిసింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘లపతా లేడీస్’ సిని మాలో లీడ్ రోల్ చేసిన స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో విలన్‌గా కనిపిస్తారని తెలిసింది. బాపి నీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్.బి నిర్మిస్తున్నారు. ‘కాంతార, విరూపాక్ష’ సినిమాలకు సంగీతం అందించిన అజనీష్‌లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. వచ్చే వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.