Bad Boy Karthik Teaser: మంచి హిట్ కోసం నాగశౌర్య (Nagashaurya) ఎప్పట్నుం^ఎదురుచూస్తున్నాడు. కానీ సరైన హిట్ మాత్రం నాగశౌర్యకు దక్కడం లేదు. జానర్స్ మార్చినా, ఆ సినిమాల బాక్సాఫీస్ ఫలితం మారడం లేదు. తాజాగా నాగశౌర్య హీరోగా నటించిన మూవీ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(badBoy Karthick Movie). త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ మూమెం ట్స్, యూత్ అప్పీల్‌తో టీజర్ బాగానే ఉంది. మరి..థియేట్రికల్‌గా ఎలా ఉంటుందనేది చూ డాలి. అలాగే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాల్సి ఉంది. నవంబరు లేదా డిసెంబరులో ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా రిలీజ్ ఉండొచ్చు.
రామ్ దేశిన దర్శకత్వంలో శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మించారు. హారిస్ జై రాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. వీధి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, సముద్రఖని, సాయికుమార్, వీకే నరేష్, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.