‘రామాయణం’ ఇతీహాసం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ (hindi Ramayana) మూవీ వస్తుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌కపూర్ (Ranbirkapoor), సీతగా సాయిపల్లవి (Saipallavi), లక్ష్మణుడిగా రవి దుబే, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోలు నటిస్తున్నారు. నితీవ్ తివారి (Director nitesh tiwari) ఈ సినిమాకు దర్శకుడు. నమిత్ మల్హోత్రా (Ramayana producer NamitMalhotra) తో కలిసి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రెండు భాగా లుగా ఈ మూవీ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది దీపావళికి తొలిభాగం, ఆపై వచ్చే ఏడాది దీపావళికి మలిభాగం విడుదల కానున్నాయి. అయితే ‘రామయణ’ సినిమాపై ఫుల్ కాన్పి డెంట్‌గా ఉన్నారు ఈ చిత్రం నిర్మాత నమిత్ మల్హోత్రా. ‘రామాయణ’ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నామని, లార్డ్ ఆఫ్ రింగ్, అవతార్ సిని మాల స్థాయిలో మా రామాయణ సిసిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. నమిత్ మల్హోత్రా కాన్పిడెన్స్ చూస్తుంటే..ఈ సినిమా బాలీవుడ్‌లో సంచనాలను నమోదు చేస్తుందా? అనే చర్చ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
రామాయణ సినిమాను గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయిన్పటికీని, ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చేసింది. అంతేకాదు..రామయణ సినిమా తొలిపార్టు చిత్రీకరణ ముగిసిందని, రెండో పార్టు చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుందన్న టాక్ తెరపైకి వచ్చింది. ముందుగా ఒక పార్టు చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత మరోపార్టు చిత్రీకరణ జరపకుండ, ఒకేసారి ‘రామాయణ’ సినిమా రెండు పార్టులను చిత్రీకరించి, ఒక్కో పార్టుగా మూవీ రిలీజ్ చేయాలన్నది చిత్రం యూనిట్ ప్లాన్ అట. గతంలో మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్‌సెల్వన్’ సినిమాను ఇదే తరహాలో చేశారు.
మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…ఈ ‘రామాయణ’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, మరో సంగీత దర్శకుడిగా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారని టాక్. ఇంకా ‘రామాయణ’ సినిమాను పూర్తిస్థాయిలో అధికారికంగా ప్రకటించడానికి, ఓ మంచి సందర్భం చూస్తున్నారట మేకర్స్.2026 వచ్చే ఏడాది దీపావళికి తొలిపార్టు రిలీజ్ కాబట్టి, రామాయణ సినిమా పూర్తి స్థాయి అనౌన్స్‌మెంట్‌కి ఇంకా సమయం పట్టొచ్చు.