Akhanda 2 New Release date: ‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన అన్ని ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వచ్చి, ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ‘అఖండ 2’ సినిమాను డిసెంబరు 12న (Akhanda 2 New Release date) విడుదల చేయనున్నట్లుగా మే కర్స్ అధికారికంగా వెల్లడించారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘అఖండ 2’. 14 రీల్స్ ఫ్లస్ పతాకంపై ఎం. తేజస్విని నంద మూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ సిని మాను డిసెంబరు 5న విడుదల చేయాలను కున్నారు. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందుల కార ణంగా, ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు ఆగిపోయింది. ఇప్పుడు డిసెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రక టించారు. ఈ చిత్రంలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పిని శెట్టి వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు (Akhanda2 Movie Cast and Crew) . ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.
ఇక డిసెంబరు 12న ‘అఖండ 2’ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో, ఆల్రెడీ డిసెంబరు 12న విడుదలకు షెడ్యూల్ అయిన ‘సైక్ సిద్ధార్థ్’, ‘ఈషా’, ‘మోగ్లీ 2025’ వంటి సినిమాలు వా యిదా పడ్డాయి. ‘ఈషా’ సినిమా డిసెంబరు 25న రిలీజ్ అవుతుండగా, ‘సైక్ సిద్ధార్థ్’ మూవీ జనవరి 1న రిలీజ్ కు షెడ్యూలైంది. ‘మోగ్లీ 2025’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవ కాశాలు ఉన్నాయి.