Nandamuri Balakrishna Akhanda2: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ‘అఖండ’ (Akhanda) చిత్రం బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం కోవిడ్ పరిస్థితులను కూడా అధికమించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో ‘అఖండ 2’ సినిమా ఉంటుందని బాలకృష్ణ ప్రకటించారు. అనుకున్నట్లుగానే ‘అఖండ2’ సినిమాను ఇటీవల ప్రకటించారు. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలోని ఈ అఖండ2 సినిమాకు నందమూరి తేజస్విని (బాలకృష్ణకుమార్తె) ఓ నిర్మాత కావడం విశేషం. గోపీ ఆంచట, రామ్ ఆచంట ఈ సినిమాకు మెయిన్ ప్రొడ్యూసర్స్.
Nandamuri Mokshagna Teja: స్టార్ట్ రోజే ఎండ్ కార్డ్ పడిపోయింది
‘అఖండ 2’ (Akhanda2) సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. ఈ సందర్భంగానే ‘అఖండ 2’ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిచారు మేకర్స్. వచ్చే ఏడాది అంటే 2025 సెప్టెంబరు 25న ‘అఖండ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. అంటే ‘అఖండ 2’ సినిమావచ్చే ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక ‘సింహా, లెజండ్, అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్‌తో వస్తున్న ‘అఖండ 2’ సినిమా కూడా విజయం సాధించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Balakrishna Aditya999: బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలైనట్లేనా..?
కాంతార సమయానికే అఖండ 2 రిలీజ్
‘అఖండ 2’ సినిమా సెప్టెంబరు 25న రిలీ (జ్‌కు షెడ్యూల్ అయ్యింది. అయితే ఇదే సమయానికి ‘కాంతార’ (kanttara) సినిమా ప్రీక్వెల్ ‘కాంతార పార్టు1’ (KantaraChapter1) రిలీజ్‌కు రెడీ అయ్యింది. అక్టోబరు 2న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిషబ్‌శెట్టి (Rishabshetty) హీరోగా నటిస్తున్నారు. ఏడురోజుల గ్యాప్‌లో రెండు మైథలాజికల్ ఫిల్మ్స్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి వీటిలో ఏదో ఒక సినిమా విడుదల వాయిదా పడిన పెద్ద ఆశ్చ్యరం అక్కర్లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి కలెక్షన్స్ షేర్ అవ్వాలని ఏ నిర్మాత కోరుకోడు కదా!