బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ (Nandamuri Balakrishna Daaku Maharaaj) రిలీజైంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ‘డాకు మహా రాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘డాకు మహారాజ్’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్, ఊరి సెంటి మెంట్ వంటి అంశాలతో ఆసక్తికరంగానే ఉంది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు బాలకృష్ణ. ‘డాకు మహారాజ్’ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతెలా ఇతర లీడ్ రోల్స్ చేశారు. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలోని ఈ మూవీని సూర్యదేవరనాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!
ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ పాత్రలో బందిపోటు పాత్రలో కనిపిస్తారు. ట్రైలర్‌లో బాలకృష్ణకు పెద్దగా డైలాగ్స్ ఏమీ లేవు. యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను చూపిం చారు. కానీ పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. అయితే ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్స్ ఆసక్తికరంగా అనిపించాయి.