సినిమా: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Nandamuri Kalyan Ram Arjun S/O Vyjayanthi Review)
ప్రధానతారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్, విజయశాంతి, సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, పృథ్వీరాజ్
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాణం: అశోక్ వర్ధన్, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోకనాథ్
కెమెరా: రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
నిడివి: 2 గంటల 24 నిమిషాలు
జానర్: ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
విడుద లేదీ: 18 ఏప్రిల్ 2025
రేటింగ్: 2.50/5
కథ
వైజాగ్ లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌అర్జున్ విశ్వనాధ్ (కళ్యాణ్ రామ్). అతని తల్లి వైజయంతి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ (విజయశాంతి). అర్జున్ తండ్రి విశ్వనాథ్ కోస్ట్గార్డ్ ఆఫీసర్. తన తండ్రి విశ్వనాధ్ ను చంపిన పైడి తల్లి ని కోర్ట్ ఆవరణం లో అర్జున్ చంపేస్తాడు. దింతో తన కొడుకు హంతకుడు అయ్యాడని, అతనిపై కోపం పెంచుకుంటుంది వైజయంతి. కన్న కొడుకు అని కూడా ఆలోచించకుండా కొడుకు కి వ్యతిరేకంగా కోర్ట్ లో సాక్ష్యం చెప్పేందుకు రెడీ అవుతోంది. మరి… అర్జున్ కి కోర్ట్ లో శిక్ష పడుతుందా? మాజీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిని, నార్త్ లో పేరు మోసిన చాలా పెద్ద క్రిమినల్ మహమ్మద్ గీయాజుధీన్ పఠాన్ (సోహైల్ ఖాన్) కు ఉన్న వైరం ఏమిటి? పఠాన్ నుంచి తన తల్లి ని అర్జున్ ఏ విధంగా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అర్జున్, వైజయంతి లు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి?అసలు ఆపరేషన్ పఠాన్ ఏమిటి? అన్నది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ
మూడు భారీ యాక్షన్ బ్లాక్స్, హెవీ డైలాగ్స్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన అర్జున్, ఎందుకు క్రిమినల్ అయ్యాడు? వైజ యంతి, పఠాన్ బ్యాక్ స్టోరీలు.. అర్జున్, వైజయంతి, పఠాన్ ల ఇంట్రడక్షన్ సీన్స్ తో తొలి భాగం ముగుస్తుంది. అర్జున్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, పఠాన్ నుంచి తన తల్లి ని అర్జున్ కాపాడే సీన్ తో సెకండ్ హాఫ్ కంప్లీట్ అవుతుంది.
Tamannaah Odela2 Movie Review: తమన్నా ఓదెల2 మూవీ రివ్యూ
రొటీన్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్స్‌లో జరుగుతుంది. ఈ తరహా సినిమాలు చాలానే చూసారు తెలుగు ఆడియన్స్.కథ లో యాక్షన్ సీన్స్ మోతాదు ఎక్కువయ్యింది. సినిమా లో ఉన్న మంచి ఎమోషన్స్ ని కూడా యాక్షన్ డామినేట్ చేసినట్లు ఉంటుంది. ముఖ్యం గా.. అర్జున్, వైజయంతి, పఠాన్ పాత్ర ల మధ్య మూవీ ఇది. అర్జున్, వైజయంతి పాత్రల మధ్య ఉన్న కన్ఫ్లిక్ట్, ఎమోషన్ గొప్పగా ఏమి లేవు. కానీ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. భారీ క్లైమాక్స్ ఎపిసోడ్ మెప్పిస్తుంది. సర్ప్రైజ్ గా, కొత్త గా ఉంటుంది. బహుశా.. క్లైమాక్స్ గురించి అందుకే టీమ్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పి నట్లు ఉన్నారు. కానీ ఆపరేషన్ పఠాన్ ఏంటో పూర్తిగా క్లారిటీ ఉండదు. వైజయంతి, పఠాన్ ల పాత్ర ల మధ్య ఉన్న లింక్ ఎస్టాబ్లిష్ కాదు. సినిమాలో ని మెయిన్ రోల్స్ మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ నిడివి ఇంకా ఉంటే బాగుండేది.
ఎవరు ఎలా చేసారు.
అర్జున్ గా కళ్యాణ్ రామ్ మంచి నటన కనబరిచాడు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసాడు. ముఖ్యం గా యాక్షన్ సీన్స్ లో మంచిగా చేశాడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. వైజయంతి గా విజయశాంతి యాక్టింగ్ సూపర్. ఇంట్రడక్షన్, ప్రీ క్లైమాక్స్ లో యాక్షన్ ఈజ్ కనిపిస్తుంది. మంచి పవర్ ఫుల్ తల్లి, మాజీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా తన యాక్టింగ్ పవర్ చూపించారు.హీరోయిన్, అర్జున్ వైఫ్ చిత్ర గా సాయి మంజ్రేకర్ కనిపిస్తుంది. ఈ రోల్ కి, ఈ కథ లో ఇంపార్టెన్స్ లేదు.వైజాగ్ న్యూ పోలీస్ కమిషనర్ ప్రకాష్ గా శ్రీకాంత్ కనిపించారు. ఈ రోల్ సర్ప్రైజ్ గా ఉంటుంది. మాజీ పోలీస్ ఆఫీసర్, హీరో కి తోడు గా ఉండే పాత్ర శివాజీ గా పృథ్వి రాజ్ (యానిమల్ మూవీ ) కీ రోల్ చేశాడు. అజనీష్ లోక నాధ్ మ్యూజిక్ ఓకే. కొన్ని సార్లు శృతి మించి వినిపిస్తుంది. రామ్ ప్రసాద్ విజువల్స్ ఒకే. నిర్మాణ విలువలు నటి నటులకు తగ్గట్టు గా ఉన్నాయి. ఇంకాస్త ఎడిటింగ్ చేయవచ్చు.
బాటమ్‌లైన్ : బాధ్యతగల కొడుకు త్యాగం