సిద్దార్థ్ (నారా రోహిత్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 30 సంవత్సరాలు దాటి, పెళ్లికి ఏజ్ బార్ అవుతున్న, తనకు వస్తున్న వరుస సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. ఎప్పుడో తన స్కూల్ డేస్‌లో ఇష్టపడ్డ తన సీనియర్ అమ్మాయి వైష్ణవీ(శ్రీదేవి విజయ్ కుమార్)లో తనకు నచ్చిన క్వాలీటీస్ ఉన్న అమ్మాయే కావాలని పట్టుపడతాడు సిద్దార్థ్. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. దీంతో విదేశాలకు వెళ్దామని పయనమయిన సిద్దార్థ్‌కు ఎయిర్ పోర్ట్‌లో ఐరా (వ్రుతి వాఘాని) అనే అమ్మాయి కనిపిస్తుంది. తాను కోరుకున్న లక్షణాలు ఐరాలో ఉండటంతో, ఈ అమ్మాయిని సిద్దార్థ్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మొదట్లో కాస్త బెట్టుచేసినా, ఆ తర్వాత ఐరా కూడా సిద్దార్థ్‌ని ఇష్టపడుతుంది. దీంతో ఐరాను పెళ్లి చేసుకుందా మనుకుంటున్న సమయంలో ఓ షాకింగ్ నిజం సిద్దార్థ్‌కు తెలుస్తుంది. అసలు..ఈ నిజం ఏమిటి? సిద్దార్థ్ జీవితంలోకి మళ్లీ వైష్ణవీ ఏ విధంగా వచ్చింది? సిద్దార్థ్, ఐరాల వివాహానికి వైష్ణవీ అనుమతి ఎందుకు కావాల్సి వచ్చింది? వైష్ణవీని సిద్దార్థ్ ఎలా కన్విన్స్ చేయాలని ప్రయత్నించాడు? అన్నది ఈ సుందరకాండ సినిమా మిగిలిన కథాంశం (Sundarakanda Review).
ఏజ్ బార్ పెళ్లికొడుకు కాన్సెప్ట్‌లతో వచ్చిన సినిమాలు ఆడియన్స్‌కు బాగానే నచ్చుతాయి. అప్పుడెప్పుడో వచ్చిన వెంకటేశ్ ‘మల్లీశ్వరి’ నుంచి ఇటీవల వచ్చిన శ్రీవిష్ణు ‘సింగిల్’ సినిమా వరకు ఈ తరహా చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా సుందర కాండ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. హీరో ఇంట్రడక్షన్, అతని ఫ్లాష్‌బ్యాక్ లవ్‌స్టోరీ, పెళ్లికి 5 కండీషన్స్….వంటివాంటితో తొలిభాగం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైతే ఇంట్రవెల్ లో ట్విస్ట్ రివీల్ అవుతుందో, అప్పట్నుంచి సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అవుతుంది (Sundarakanda Review).
Ramcharan Peddhi: సైలెంట్‌గా కథను మార్చేశారా?
నిజానికి ఇంట్రవెల్‌లో ఓ సారి ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఒక చెప్పడానికి కథ ఏమి లేదనిపిస్తుంది. కానీ దర్శకుడు వెంకటేష్ ఇక్కడే తన కలానికి పదును పెట్టాడు. సెకండాఫ్‌ను చాలా కన్విన్సింగ్‌గా తీసి, ఆడియన్స్‌ను ఒప్పించగలిగాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫర్వాలే దనిపించాయి. క్లైమాక్స్‌ను అక్కడిక్కడే చూట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. సత్య కామెడీ ఓ మేజర్ హైలైట్‌గా ఉంటుంది ఈ సినిమాలో. కానీ కొన్ని ఊహాత్మాక సన్నివేశాలు, సాగదీత ధోరణీ కనిపిస్తుంది. కానీ అక్కడక్కడ వచ్చే నవ్వులు ఈ మైనస్‌లను కప్పేస్తాయి.

సిద్దార్థ్ పాత్రలో నారా రోహిత్ బాగానే యాక్ట్ చేశాడు. తనపై మిగతా పాత్రలు పంచ్ లేస్తున్నా, హీరోయిజం జోలికి వెళ్లకుండ, డైరెక్టర్ విజన్‌కే కట్టుబడి, సినిమా సక్సెస్‌లో భాగమైయ్యాడు. నారా రోహిత్ తర్వాత ఈ సినిమాను మోసింది హాస్య నటుడు సత్య. చాలా సన్నివేశాల్లో సత్య ఆడియన్స్‌ను నవ్వించాడు. వ్రుతి వాఘాని మంచి నటన కనబరించింది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ఎస్సెట్ …శ్రీదేవి విజయ్‌కుమార్. వైష్ణవీ పాత్రలో శ్రీదేవి సూపర్ యాక్టింగ్ చేసింది. స్కూల్ డ్రెస్ వేసుకుని మరీ స్క్రీన్‌పై కనిపించింది. ఈ వయసులో ఆమె స్కూల్ డ్రెస్‌లో ఒదిగిపోవడం అంటే చాలనే కష్టపడి ఉంటారు ఈ సన్నివేశాల కోసం . సత్యకు పెయిర్‌గా సునైన ఆన్‌స్క్రీన్‌పై కుదిరారు. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, రఘు బాబు….వారి వారి పాత్రల పరిధి మేరకు నటిం చారు. నిర్మాతలు సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి…నిర్మాణ విలువలు ఒకే. వెంకటేష్ నిమ్మలపూడి మంచి డైరెక్షన్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తనలోని మెచ్యూర్డ్ రైటర్‌ని చూపించాడు. థిన్ అండ్ సెన్సిబుల్ పాయింట్‌ను చక్కగా ఆడియన్స్‌కు చెప్పగలిగాడు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఒకే.రోహన్ చిల్లాలే ఎడిటింగ్, ప్రదీష్ ఎం వర్మ కెమెరా వర్క్ ఒకే.
ఫైనల్‌గా… నవ్వుల సుందరకాండ
రేటింగ్ 2.5/5