eleven movie: కథ
eleven movie review: వైజాగ్‌లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరవింద్ (నవీన్‌చంద్ర). చాలా కేసులను సులభంగా సాల్వ్ చేసేస్తుంటాడు. మరోవైపు సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. ఈ కేసును డీల్ చేసే పోలీసాఫీసర్ రంజిత్ (శశాంక్)కు యాక్సిడెంట్ కావడంతో, ఈ కేసును సాల్వ్ చేయాల్సిన బాధ్యత అరవింద్‌పై పడుతుంది. అరవింద్ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒప్పుకున్న తర్వాత కూడా వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి. చాలా కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరవింద్‌కు కొన్ని క్లూస్ దొరుకుతాయి. తన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కిల్లర్…ట్విన్స్నే (కవల పిల్లలు) టార్గెట్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. మరి..అరవింద్ నిజమైన హంతుకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అరవింద్‌కు ఎదరైన సవాళ్లు, సమస్యలు ఏమిటి? కిల్లింగ్స్ గురించి అరవింద్ తెలుసుకున్న నిజాలు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి(eleven movie review).
వివరణ
తెలుగులో ఇన్వెస్టిగేషన్ డ్రామాలను చాలానే చూశారు ఆడియన్స్. కోవిడ్ తర్వాత ఓటీటీల పుణ్యమా అని ఇన్వెస్టిగేషన్ పోలీస్ డ్రామా కథలు, సైకో కిల్లర్స్ స్టోరీలను మరింత ఎక్కువగా చూశారు తెలుగు ఆడియన్స్. ఇలాంటి తరుణంలో ఆడియన్స్‌ను మెప్పించాలంటే..కథ, ఈ కథను ఆడియన్స్ కళ్లముందుకు తీసుకువెళ్లే స్క్రీన్ ప్లే విధానం కచ్చితంగా కొత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఆడియన్స్‌ను మెప్పించడం కష్టం. అయితే ఈ విషయంలో లెవన్ మూవీ కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే, ఆర్ఆర్, ట్విస్ట్‌లు బాగా కుదరాలి. కథలో ఇవి సరిపోయాలి. ఇవి ‘లెవన్’ సినిమాలో బాగానే కుదిరాయి (eleven movie Release)

కిల్లర్ మోటివ్, కిల్లింగ్ కాన్సెప్ట్, ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్, ఇన్వెస్టిగేషన్ తీరు, నెక్టోఫోబియా కాన్సెప్ట్…ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. చాలా థ్రిల్లర్ సినిమాలకు ఉండే కంప్లైంట్ ఏంటంటే… అనవసరపు లవ్‌స్టోరీ. ఈ సినిమాలో కూడా అదే ప్రాబ్లమ్. కథను ఆడియన్స్‌కు చేరువ అయ్యే క్రమంలో లవ్ ట్రాక్ ఓ స్పీడ్బ్రేకర్లా ఉండిపోతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ప్రజెంట్ చేసిన తీరు బాగుంటుంది. కానీ విలన్ ఎవరు? అనే విషయంలో సస్పెన్స్ ఎవరనేది..విరామం సమయానికే..ఆడియన్స్‌కు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. (రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి తెలు స్తుంది). విలన్ ట్రాక్ ఆడియన్స్‌ను ఎగై్జట్ చేయకపోవచ్చు.
eleven movie Cast and Crew: నటీనటులు-సాంకేతిక విభాగం
రెగ్యులర్‌గా పోలీసాఫీసర్ పాత్రలు ఉండే సినిమాలు చేసే నవీన్‌చంద్ర (Naveenchandra Eleven movie hero) …ఈ అరవింద్ పోలీ సాఫీర్ పాత్రలో బాగానే చేశాడు. మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. నిజమైన పోలీసాఫీసర్లా స్క్రీన్‌పై ఫిట్‌గా కనిపించాడు. నవీన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. హీరోయిన్గా రియా హరి రోల్ ఒకే. కానీ ఒకప్పటి హీరోయిన్ అభిరామికి కథలో బలమైన కీలకమైన రోల్ లభించింది. పోలీస్ ఆఫీసర్స్‌గా దిలీపన్, శశాంక్, ఆడుకాలం నరేన్ కథలో కీలకమైన రోల్స్ చేశారు. రియాత్విక్, రవివర్మ, నటుడు అరై్జ, కిరిటీ దామరాజు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు.
Read more MassJathara update: రవితేజ నన్ను విలన్ని చేశాడు!
స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ విషయంలో ఈ సినిమా దర్శకుడు లోకేష్ (Eleven movie director Lokesh) ను అభినందించాల్సిందే. నవీన్ చంద్ర హీరో అని కాకుండా, కథను నమ్మి నిర్మాతలు ఖర్చుపెట్టినట్లుగా ఉంది. బాగానే ఖర్చు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ మ్యూజిక్ కొన్నిచోట్ల బాగుంది. మరికొన్ని సన్నివేశా ల్లో..అవసరమైనదాని కన్నా ఎక్కువగా వినిపించింది. ఎడిటింగ్ ఒకే.
రేటింగ్: 2.5/5
బాటమ్‌లైన్: ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్