‘సైరా:నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ సినిమాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార (Nayanthara in Chiranjeevi movie) స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడితో ఓ సినిమా రానుంది. ఈ మూవీలోనే నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు (Nayanthara in Mega 157). ఓ స్పెషల్ వీడియో తో ఈ అనౌన్మెంట్ వచ్చింది. ఇటీవల అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి, ఈ స్పెషల్ వీడియో ను షూట్ చేశారు.
#Mega157#Nayanathara#AnilRavipudi#Chiranjeevipic.twitter.com/z8gGE8MuGB
— TollywoodHub (@tollywoodhub8) May 17, 2025
ఇంకా ఈ మూవీ (ChiruAnil)లోని మరో హీరోయిన్ పాత్రలో క్యాథరీన్, ఇతర సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో అభినవ్ గోమఠం, హర్షవర్థన్, సచిన్ ఖేడ్కర్‌లు యాక్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లోని ఈ 157వ సినిమాను సుష్మితా కొణిదెల (చిరంజీవి పెద్ద కుమార్తె), సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఈ మెగా 157 సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఆల్రెడీ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిరంజీవి-నయనతారలు స్క్రీన్ షేర్ చేసుకున్న విధానం కొత్తగా ఉంటుంది. చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి- నయనతారలు భార్య భర్తలుగా యాక్ట్ చేశారు. మలయాళ హిట్ ఫిల్మ్ లూసీఫర్ తెలుగు రీమేక్‌లో ‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవి-నయనతారలు అన్నచెల్లెల్లుగా నటించారు. ఇప్పుడు మెగా157 సినిమాలో హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండటం విశేషం.
మరోవైపు ఈ సినిమా చేసేందుకు నయనతార భారీ పారితోషికం డిమాండ్ చేశారని, అయితే ఆ తర్వాత అనిల్‌రావిపూడి చెన్నై వెళ్లి నయనతారతో మాట్లాడి, ఓ డీసెంట్ రెమ్యూనరేషన్‌కు ఒకే ఒప్పుకునేలా చేశారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు ‘ముక్కుత్తి అమ్మన్ 2, రాక్షసి (తమిళంలో రక్కయీ)’ వంటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్‌తో ఎప్పట్లానే బిజీగా ఉన్నారు.