హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో 2023 సంక్రాంతికి విడుదలైన, వీరసింహారెడ్డి చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ నిర్మించింది. ఆ తర్వాత వెంటనే మరో సినిమాను బాలకృష్ణతో చేయాలనుకున్నారు గోపీచంద్ మలినేని, కానీ అప్పటికే దర్శకుడు బాబీకి బాలకృష్ణ కమిట్‌మెంట్ ఇచ్చే శారు. అలా బాలకృష్ణతో బాబీ ‘డాకుమహారాజ్’ మూవీ తీశాడు. అయితే ‘డాకు మహారాజ్’ సినిమా టైమ్‌లోనే బాలకృష్ణకు మరో కథ చెప్పారు గోపీచంద్ మలినేని. అదే ‘జాట్’ కథ. ఈ స్టోరీ బాలకృష్ణకు కాస్త రోటీన్‌గా అనిపించడంతో, ఈ కథకు సున్నితంగా నో చెప్పారు బాలయ్య. ఇదే కథకు సన్నీడియోల్ ఒకే చెప్పడంతో, సనీడియోల్‌తో ‘జాట్’ సినిమా సెట్స్‌కు వెళ్లింది. ఇటీవల విడుదలైన ‘జాట్’ సినిమా ఫర్వాలేదనిపించుకుంది.
THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥
Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑
This one’s going to be HISTORIC! 💥
Backed by the passionate force #VenkataSatishKilaru garu under… pic.twitter.com/1bRWPX83J0
— Gopichandh Malineni (@megopichand) June 8, 2025
ఫైనల్‌గా…బాలకృష్ణతో గోపీచంద్ మలినేని మరో సినిమాను కన్ఫార్మ్ చేసుకున్నాడు (NBK111 Movie). జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే (Nandamuri BalakrishnaBirthday). ఈ సందర్భంగా బాలకృష్ణ (Hero NandamuriBalakrishna 111 movie) , గోపీచంద్ మలినేనిల (Director GopichandhMalineni) కాంబో కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఈ సారి ఇది రోటీన్ తరహా సినిమా అయితే కాదనిపిస్తోంది.
హిస్టారికల్ మూవీగా ఈ చిత్రం రాబోతుంది. ఆ చారిత్రాక చిత్రం రాజుల కాలం నాటి నేపథ్యంతో ఉంటుందా? లేక ‘హరిహరవీరమల్లు, గౌతమిపుత్రశాతకర్ణి’ వంటి సినిమాల నేప థ్యంతో ఉంటుందా? అనేది చూడాలి. రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ సినిమాను నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు (Producer VenkatsathisKilaru), బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని మూవీని నిర్మిస్తారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో ఇది రెండో సినిమా కావడం విశేషం.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ చేస్తున్నాడు. బోయపాటి శీను డైరెక్టర్. ‘అఖండ’ (Akhanda) సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఇండస్ట్రీలో ‘అఖండ 2’ (Akhanda 2) పై అంచనాలు ఉన్నాయి. ‘అఖండ 2’ టీజర్ జూన్ 9న సాయంత్రం విడుదల కానుంది. ఇంకా..జూన్ 10న బాలయ్య బర్త్ డే కాబట్టి, ఆ రోజు బాలకృష్ణకు చెందిన మరో కొత్త సినిమా అప్‌డేట్ రావొచ్చు. ‘మార్కో’ సిని మా డైరెక్టర్ హమీద్ ఇటీవల బాలకృష్ణకు ఓ కథ చెప్పారని, పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ మూవీ పై అధికారిక ప్రకటన వచ్చే చాన్సెస్ ఉన్నాయని టాలీవుడ్ టాక్.