ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు స్టార్‌డమ్ స్పాన్ తక్కువ. ఆ మాటకొస్తే అవకాశాల సమయం కూడా తక్కువే. అలాంటిది ఒకే సినిమా కోసం ఓ హీరోయిన్ ఐదు సంవత్సరాలు కేటాయిం చడం అంటే అది చిన్న విషయం కాదు. పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా కోసం నిధీ అగర్వాల్ అదే చేశారు. ‘బాహుబలి’ రెండు పార్టుల కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ఎన్టీఆర్ నాలుగేళ్ళు, రామ్‌చరణ్ చరణ్ మూడేళ్లు కేటాయించారు. అలా ‘హరిహరవీరమల్లు’ (Hariharaverramallu) సినిమా కోసం నిధీ అగర్వాల్ ఐదేళ్లు కేటాయించారు. కానీ సినిమా హిట్ అయితే క్రెడిట్ మాత్రం హీరో పవన్‌కల్యాణ్‌కి వెళ్తుంది. ఈ విషయం కాస్త లేటుగా గ్రహించినట్లుఉన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్ (Heroine Nidhi Agarwal). ఈ విషయంపై ఆమె పరోక్షంగా మాట్లాడారు.
హరిహర వీరమల్లు సినిమా అగ్రీమెంట్ వల్ల మరో సినిమా చేయడం కుదరలేదని, భవిష్యత్‌లో ఇలాంటి తరహా అగ్రిమెంట్స్‌కు దూరంగా ఉంటానని, ‘హరిహరవీరమల్లు’ పార్టు 2కీ అగ్రీమెంట్ చేసే ప్రసక్తే లేదని, ఆ మాటకోస్తే….గ్రాఫిక్స్ చాలా ఎక్కువగా ఉండే సినిమాలు చేయాలనుకోవడం లేదని నిధీ అగర్వాల్ కుండబద్దలు కొట్టేశారు. నిజమే..నిధీ ఆవేదనలో
న్యాయం ఉంది. లైవ్లీహుడ్ కోసం తాను షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్‌కి వెళ్లాలని నిధీ చెప్పడం కాస్త ఆలోచించదగ్గ విషయమే. ఈ విషయంలో నిధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, మిగతా హీరోయిన్స్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
ఇక హరిహరవీరమల్లు సినిమా గురించి నిధీ మాట్లాడారు. ‘హరిహరవీరమల్లు’ సినిమా గురించి నిధీ మాట్లాడారు. పవన్ కల్యాణ్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాలో తాను పంచమి అనే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశానని నిధీ చెప్పారు. ఈ పంచమి క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయని ఆమె తెలిపారు. ఇంకా రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన యాక్ట్ చేసినందుకు నిధీ హ్యాఫీ ఫీలవుతున్నారు. ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అని, సెట్స్‌లో బాగా ఉంటాడని కితాబులిచ్చారీ బ్యూటీ.