Nithiin Robinhood Review: రామ్ (నితిన్) అనాథ. అనాథ శరణాయాలకు సాయం చేయాలనుకుని, రాబిన్‌హుడ్‌గా మారతాడు. సంపన్నులను దోచుకుని, పేదవారికి సాయం చేస్తుంటాడు. రాబిన్‌హుడ్‌ను పట్టుకునేందుకు ఓ స్పెషల్ పోలీసాఫీసర్ వర్గీస్ (షైన్ టామ్ చాకో) రంగంలోకి దిగుతాడు. ఆల్మోస్ట్ రాబిన్‌హుడ్ పట్టుబడతాడు అనుకునే టైమ్‌లో…తృటిలో తప్పించుకుంటాడు రాబిన్‌హుడ్. కొన్నాళ్ళ దొంగతనాలకు బ్రేక్ ఇచ్చి, సున్నిపెంట జాన్ (రాజేంద్ర ప్రసాద్) రన్ చేసే ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సైంటిస్ట్ అభినవ్ వాసుదేవ్ (షిజు) కుమార్తె నీరా వాసుదేవ్ సంరక్షణ బాధ్యతలు రాబిన్‌హుడ్ చూసుకోవాల్సి వస్తుంది. కానీ నీరా వాసుదేవ్‌ను రుద్రంకోటను శాసించే క్రూరుడు సామి టార్గెట్ చేస్తాడు. మరి..నీరా వాసుదేవ్‌ని రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ ఎలా కాపాడతాడు? నీరా వాసుదేవ్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రావడం వెనక ఉన్న కారణం ఏమిటి? రుద్రంకోట గ్రామానికి …నీరా వాసుదేవ్, రామ్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథనం(Robinhood Review).
నితిన్, వెంకీ కుడుముల (Robinhood Director) కాంబినేషన్‌లోని ‘భీష్మ’ సినిమా సూపర్‌హిట్. ఈ మూవీ తర్వాత వీరి కాంబి నేషన్‌లో వచ్చిన ‘రాబిన్‌హుడ్’పై అంచనాలను ఉండటం సహజం. కానీ ఈ అంచనాలను ‘రాబిన్‌హుడ్’ మూవీ అందుకోలేకపోయింది. సినిమాలు చూసే విషయంలో ఆడియన్స్ ఇప్పుడు చాలా అంటే చాలా స్మార్ట్ అయిపోయారు. ఓటీటీల పుణ్యమా అని…సినిమా నాలెడ్జ్, స్క్రిప్ట్‌పై జడ్జిమెంట్, సాంకేతిక విషయాలకు ఆడియన్స్ బాగా దగ్గరైయ్యారు. సో….ఆడియన్స్‌ను మభ్య పెట్టి ఓ కమర్షియల్ హిట్ కొట్టేదామంటే.. కుదరదు….రాబిన్‌హుడ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కమర్షియల్ టెంప్లెట్ సినిమాకూ, కాస్తంత ఎమోషన్ జోడించారు. కానీ ఇది వర్కౌట్ అయినట్లు లేదు. సినిమా తొలిభాగంలో వచ్చే వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. కానీ హీరో డామినేషన్ లేకుండా, కమే డియన్స్ హవా కథలో కొనసాగితే…ఆ సినిమా థియేటర్స్‌లో కొనసాగదు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ సీన్స్, హీరో దొంగతనాలు, వర్గీస్ ప్లాన్స్‌తో తొలిభాగం సాగుతుంది. ఇంట్రవెల్ తర్వాత రాబిన్‌హుడ్ కథ రుద్రం కోటకు చేరుతుంది. ఇక్కడ హీరో ఇంటలెక్చువల్ థాట్స్, హీరో– విలన్‌ల మధ్య ఎత్తుకుపైఎత్తు సీన్స్ వంటివి ఉన్నా…కథలో వీటిని దర్శకుడు వెంకీ కుడుముల సరిగ్గా రాసుకోలేదు. సీసీ కెమెరాల రివీల్, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఆడియన్స్‌కు కాస్త ఉపశమనం కలిగించినా, పేలవమైన క్లైమాక్స్ ఆడియన్స్‌ను మళ్లీ నిరాశ పరుస్తుంది.
నితిన్ (Nithiin) స్క్రీన్‌పై స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. కానీ యాక్టింగ్ రోటీన్‌గా ఉంటుంది. కమర్షియల్ సిని మాలో హీరోయిన్ రోల్‌కు ప్రాముఖ్యత ఉండటం తెలుగు సినిమాల్లో ఉండదు. ఇక్కడ అంతే. నీరా వాసుదేవ్‌గా శ్రీలీల పాత్ర అంతగా లేదు. కథలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల పాత్రలు కామెడీ పరంగా సినిమాకు బలాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ సన్నివేశాలు. విలన్ సామీగా దేవదత్తా నాగే (ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి రోల్ చేసిన యాక్టర్) రోల్ బలంగా మొదలై, స్లో అయి పోయింది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో రోల్ కూడా అంతే. మైమ్ గోపీ రోల్ ఫర్వాలేదు. కేతికాశర్మ అదిదా సర్‌ప్రైజ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ల క్యామియోలు ‘రాబిన్‌హుడ్’కు బలం కాలేకపోయాయి.
సంపన్నులను దోచుకుని, హీరో పేదలకు సాయం అనే పురాతన లైన్‌ను స్టోరీగా ఎంచుకున్నప్పుడు ఏదైనా కొత్త పాయింట్ ఉండాలి. కొండవీటి దొంగ, కిక్, జెంటిల్‌మేన్ (అర్జున్) వంటి సినిమాలు గుర్తుకు రా కూడదు. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమా ప్రథమార్థం ఒకే అనుకున్నా.. సెకండాఫ్ డ్రామాను రక్తికట్టించడంలో విఫలైమయ్యాడు. జీవీ ప్రకాష్ సంగీతం బాగుంది. ఆర్‌ఆర్ అక్కడక్కడ ఒకే. కానీ సాంగ్స్ సందర్భానుసారంగా వచ్చీ ఉంటే బాగుండేది. మైత్రీ నిర్మాణ విలువలు ఎప్పటిలానే రిచ్‌గాఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. సినిమాటోగ్రఫీ ఒకే.
ఫైనల్‌గా…రాబిన్‌హుడ్…ఆడియన్స్ నుంచి పెద్ద సాయమే కావాలి
రేటింగ్: 2.25