హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘భీష్మ’ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. 2025 మార్చి 28న ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కమర్షియల్ ప్యాక్డ్‌గా ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. గంజాయి స్మగ్లింగ్ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. హీరోయిన్‌గా శ్రీలీల యాక్ట్ చేస్తుండగా, విలన్‌గా బాలీవుడ్ నటుడు దేవ్ దత్తా (ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమంతుడి పాత్ర చేసిన నటుడు) యాక్ట్ చేశాడు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఏ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్‌గా రాజేంద్రప్రసాద్ రోల్ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన మీరా వాసుదేవన్ పాత్రలో శ్రీలీల యాక్ట్ చేశారు.
రాబిన్‌హుడ్ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ ఇలా…
నా పేరు రామ్ సార్..ఏజెన్సీకి తగ్గట్లు..‘రాబిన్‌హుడ్’ అని మార్చేసుకుంటాను
కొవొత్తి వెలుగునిస్తుంది…అది వెలగాలంటే..మీలాంటి ఫైర్ కావాలి…మేడమ్
అసలు…నీ స్కెచ్ ఏంటి?
ఇప్పుడు వస్తుందా రా..అసలైనా కిక్కు!
స్పెషల్ సర్‌ప్రైజ్‌లు
ఈ మూవీలో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్‌ప్రైజ్’కు శ్రోతల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌కు బాగా సుపరిచితుడైన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేశారు. క్లైమాక్స్‌లో డేవిడ్ వార్నర్ రోల్ ఉంటుంది. నిజానికి…‘రాబిన్‌హుడ్’ సినిమాను 2024 డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా 2025 మార్చి 28న రిలీజ్ చేస్తున్నారు.
గట్టిపోటీనే!
రాబిన్‌హుడ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. ‘రాబిన్‌హుడ్’తో పాటుగా, మరో తెలుగు సినిమా ‘మ్యాడ్ 2’ కూడా మార్చి 28ననే రిలీజ్ అవుతోంది. ఇంకా తమిళలో విక్రమ్ చేసిన ‘వీరు ధీర శూరన్’ సినిమా తెలుగులో ‘వీర ధీర శూర’,గా మోహన్‌లాల్ ‘లూసీఫర్’ రెండో పార్టు ‘ఎంపురాన్’
గా మార్చి 27న రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇక ఫైనల్‌గా…మార్చి 30న సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్ సందర్భంగా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.